Home » Devotees
మహానంది క్షేత్రంలో శుక్రవారం రాత్రి పల్లకీ ఉత్సవాన్ని ఆలయ వేదపండితులు, అర్చకులు వైభవంగా నిర్వహించారు.
శ్రీశైలం మహాక్షేత్రంలో శనివారం మార్గశిర శుద్ధ షష్ఠిని పురస్కరించుకుని లోకకళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్య (కుమార స్వామి)కి విశేష అభిషేకం, అర్చనలు, హోమం నిర్వహించారు.
శ్రీశైల మహాక్షేత్రంలో లోకకల్యాణార్థం శుక్రవారం స్వామి, అమ్మవార్లకు ఊయల సేవను వైభవంగా నిర్వహించారు.
కార్తీక మాసం ముగింపు సందర్భంగా పోలి పాడ్యమి నేపథ్యంలో కృష్ణమ్మ దీపాల వెలుగుల కాంతులతో కళకళలాడుతోంది. కార్తిక మాసం నెలరోజులు పుణ్య స్నానాలు చేసిన భక్తులు.. కార్తీక మాసం ముగింపు నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున భక్తులు పోలిని స్వర్గానికి పంపారు. నదీ స్నానమాచరించి ఆవు నేతిలో ముంచిన వత్తులను అరటిదొప్పలలో పెట్టి వెలిగించి, నదిలో విడిచిపెట్టారు.
కార్తీకమాసం సంద ర్భంగా మహానంది ఆలయం బుధవారం భక్తులతో కిటకిటలాడింది.
పంచారామ క్షేత్రం పాలకొల్లలోని క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. సోమవారం తెల్లవారుజాము నుంచి స్వామి వారి మూలవిరాట్కు అభిషేకాలు జరుగుతున్నాయి. భక్తులు దీపోత్సవాలు చేస్తున్నారు. కార్తీకమాసం ఆఖరి సోమవారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేస్తున్నారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహ స్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారిని దర్శించుకోడానికి ప్రముఖులు, భక్త జనం పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. లక్ష్మీనరసింహ స్వామి ధర్మ దర్శనానికి సుమారు 2 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది.
కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవాలయాలు దీపాల కాంతుల్లో వెలిగిపోయాయి. మహిళలు భక్తి పారవశ్యంతో వెలిగించిన దివ్వెలతో కోవెలలు కార్తీక శోభను సంతరించుకున్నాయి.
హిందువులు పవిత్రంగా భావించే కార్తీక మాసం ప్రారంభంకావడంతో భక్తులు పరమశివుడి సేవలో తరిస్తున్నారు. కార్తీక రెండో సోమవారం సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు కావడంతో స్వామి దర్శనార్థం వేలాదిగా భక్తులు వరసిద్ధుడి ఆలయానికి విచ్చేయడంతో క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి.