Today Horoscope : ఈ రాశి వారు వ్యక్తిగత సౌకర్యాలు గురించి ఆలోచిస్తారు
ABN , Publish Date - Jan 02 , 2025 | 04:54 AM
రాశిఫలాలు 2-1-2025 - గురువారం మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
రాశిఫలాలు
2-1-2025 - గురువారం
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం అందుకుంటారు. బ్యాంకులతో లావాదేవీలకు అనుకూలం. యూనియన్ కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఊరేగింపులు, ప్రదర్శనల్లో కీలకపాత్ర పోషిస్తారు. వేడుకల్లో ఉ ల్లాసంగా గడుపుతారు.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)డ
రాజకీయ రంగంలోని వారు ఉన్నత పదవులు అందుకుంటారు. కన్సల్టెన్సీ, రవాణా, బోధన, రక్షణ రంగాల వారికి వృత్తిపరంగా ప్రోత్సాహకరంగా వుంటుంది. ప్రమోషన్లు, గౌరవ పదవుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రీ దత్త కవచ పారాయణ శుభప్రదం.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
కమ్యూనికేషన్లు, ఉన్నత విద్య, ఆడిటింగ్ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరగా ఉంటుంది. సమావేశాలు, వేడుకల్లో బంధుమిత్రులను కలుసుకుంటారు. చర్చలు, ప్రయాణాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
సన్నిహితుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. బీమా, మెడికల్ క్లెయిములకు సంబంధించిన వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలను సమీక్షించుకుంటారు. ఆంజనేయ స్వామిని ఆరాధించండి.
సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
సమావేశాలు, వేడుకల్లో కీలకపాత్ర పోషిస్తారు. నూతన భాగస్వామ్యాలకు అనుకూలం. కొత్త పరిచయాలు లక్ష్య సాధనకు ఉపకరిస్తాయి. స్టాక్‌మార్కెట్ లావాదేవీలు, పందాలు, పోటీల్లో నిదానం అవసరం. సన్నిహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
సేవలు, వ్యవసాయం, పరిశ్రమలు, డెయిరీ రంగాల వారు సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఆహార నియమాలు పాటిస్తారు. చిన్నారులు, ప్రియతములతో విందుల్లో పాల్గొంటారు.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
క్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. చిన్నారులు, విద్యార్థుకు శుభప్రదం. విద్యాసంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. పెట్టుబడలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి అనుకూలం. ఇల్లు, స్థలం మార్పునకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. ఇంటికి అ వసరమైన వస్తువులు సమకూర్చుకుంటారు. అగ్రిమెంట్లకు అనుకూలమైన రోజు. అన్నదమ్ముల వైఖరిలో మార్పు గమనిస్తారు.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
పాఠశాలలు, మార్కెటింగ్, ట్రెయినింగ్, ట్రాన్స్‌పోర్ట్, స్టేషనరీ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఫీజులు చెల్లించేందుకు అ వసరమైన నిధులు సమకూర్చుకుంటారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. విలువైన పత్రాలు అందుకుంటారు.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. పెండింగ్ బిల్లులు మంజూరు అవుతాయి. చిట్‌ఫండ్‌లు, ఆర్థిక సంస్థల వారికి ప్రోత్సాహకరంగా వుంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
కొత్త పరిచయాలు లాభిస్తాయి. మనసు ఉల్లాసంగా వుంటుంది. దూర ప్రయాణాలు, ఉన్నత విద్యా విషయాలపై ఒక నిర్ణయానికి వస్తారు. వ్యక్తిగత సౌకర్యాలు గురించి ఆలోచిస్తారు. సంకల్పం ఫలిస్తుంది. శ్రీ దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ శుభప్రదం.
మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
దూరంలో వుండే బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ప్రయాణాలు, చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. గత అనుభవం లక్ష్య సాధనకు తోడ్పడుతుంది. సాయిబాబా ఆలయాన్ని దర్శించండి.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ