Today Horoscope : ఈ రాశి వారు ముఖ్యమైన సమాచారం అందుకుంటారు.
ABN , Publish Date - Jan 06 , 2025 | 02:30 AM
నేడు (06-01-2025-సోమవారం) ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి.
నేడు (06-01-2025-సోమవారం) ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. పైఅధికారుల మన్ననలు పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పనులు చేపడతారు. పలుకుబడిగల వ్యక్తుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి. వీసా, పాస్‌పోర్డ్ వ్యవహారాలకు అనుకూలం. సినమాలు, రాజకీ యాలు, టెలివిజన్, పత్రికల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. శుభవార్త అందుకుంటారు. సేవా కార్యక్రమాలు మనుసుకు ఊరటనిస్తాయి.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
చిరకాల మిత్రులను కలుసుకుంటారు. బృందకార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. గత అనుభవంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాల్లో భాగస్వామి సహకారం లభిస్తుంది. పదిమందిలో మంచిపేరు తెచ్చుకుంటారు. ప్రభుత్వరంగ సంస్థల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. న్యాయవిషయాల్లో పెద్దలు సహకరిస్తారు.
సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి వృత్తి వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. రక్షణ, న్యాయ, బోధన, కళా రంగాల వారికి ప్రోత్సాహకరమైన సమయం. కీలక సమాచారం అందుకుంటారు. బంధుమిత్రులతో విందుల్లో పాల్గొంటారు.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. చిన్నారులు, ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పన్నులు, బీమా వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. రుణాలు మంజూరవుతాయి.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
శ్రీవారు, శ్రీమతి వ్యవహారశైలిలో మార్పు గమనిస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. న్యాయ వివాదాలు, పోటీల్లో విజయం సాధిస్తారు.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
ఇంటర్వ్లూలో విజయం సాధిస్తారు. సహోద్యోగులతో చర్చలు ఆనందం కలిగిస్తాయి. వైద్య, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారికి ఒక వార్త ఆనందం కలిగిస్తుంది. సంకల్పం నెరవేరుతుంది. తోబుట్టువులతో విందు వినోదాల్లో పాల్గొంటారు.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీలోని సృజనాత్మక ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. మూచ్యువల్ ఫండ్స్, చిట్‌ఫండ్ తదితర పెట్టుబడులు లాభిస్తాయి. క్రీడలు, బోధన, బ్యాంకింగ్ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
మీమనసు మార్పు కోరుకుంటుంది. సంకల్పం నెరవేరుతుంది. బదిలీలు, మార్పులకు అనుకూల సమయం. కుటుంబం విస్తరిస్తుంది. ఇంటి అవసరాలపై దృష్టి సారిస్తారు. హార్డ్‌వేర్, ఇంటీరియర్ డిజైనింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. దూరంలో ఉన్న మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. తోబుట్టువుల సమస్యలను పరిష్కారిస్తారు. లక్ష్యాలు సాధిస్తారు.
మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సకాలంలో డబ్బు చేతికి అందుతుంది. బృందకార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. షేర్‌మార్కెట్ లావాదేవీలు, డిపాజిట్లకు అనుకూలం.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ