Today Horoscope : ఈ రాశి వారికి వేడుకల్లో ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది.
ABN , Publish Date - Jan 12 , 2025 | 02:21 AM
నేడు (12-01-2025-అదివారం) ఇంట్లో వేడుకలు, సమావేశాల్లో పెద్దల సహకారం లభిస్తుంది.
నేడు (12-01-2025-అదివారం) ఇంట్లో వేడుకలు, సమావేశాల్లో పెద్దల సహకారం లభిస్తుంది.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ఇంట్లో వేడుకలు, సమావేశాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. బదిలీలు, మార్పులకు అనుకూలమైన రోజు. భూమి లావాదేవీలు, నిర్మాణ రంగాల వారి పెద్దల సహకారం లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపార విస్తరణ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలమైన రోజు. తోబుట్టువులతో వేడుకల్లో పాల్గొంటారు. ప్రయాణాలు, చర్చలకు అనుకూలం. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. శ్రీ సూర్యాష్టక పారాయణ శుభప్రదం.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులు, పొదుపు పథకాలకుసంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారు. నిధులు సకాలంలో చేతికి అందుతాయి. ఆర్థిక విషయాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. శ్రీ ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
భాగస్వామి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో సన్నిహితులతో చర్చించి ఒక నిర్ణయానికి వస్తారు. వేడుకలు, సమావేశాలు ఆనందం కలిగిస్తాయి. పందాలు, పోటీల్లో తొందరపాటు కారణంగా నష్టపోతారు. సూర్యారాధన శుభప్రదం.
సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
సినిమాలు, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి. విదేశీ ప్రయాణాలు, ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూల సమయం. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి. శ్రీ దుర్గామాత ఆలయాన్ని దర్శించండి.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిన్నారుల వైఖరి ఆనందం కలిగిస్తుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆడిటింగ్, పాఠశాలలు, క్రీడాసంస్థలు, ప్రకటన రంగాల వారికి ఆర్థికంగా అనుకూల సమయం. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
బదిలీలు, మార్పులకు అనుకూలం. పెద్దలు, పై అధికారుల వైఖరి ఆనందం కలిగిస్తుంది. ప్రభుత్వ సంస్థలతో పనులు పూర్తవుతాయి. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. సూర్యాష్టక పారాయణ శుభప్రదం.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
ప్రయాణాలు, చ ర్చలకు అనుకూలమైన రోజు. విద్యార్థులు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. దూరంలో ఉన్న బంధుమిత్రులతో చర్చలు ఆనందం కలిగిస్తాయి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. దుర్గామాతను ఆరాధించండి.
ధనుస్పు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక లావాదేవీల్లో రాణిస్తారు. రుణ ప్రయత్నాలు పలిస్తాయి. వైద్య సేవలకు ఖర్చు చేస్తారు. పెన్షన్, మూచ్యువల్ ఫండ్స్ వ్యవ హారాలు పూర్తవుతాయి. విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. గోమాత ఆరాధన శుభప్రదం.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
భాగస్వామి వైఖరి ఆనందం కలిగిస్తుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. వేడుకల్లో ఖ ర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. పందాలు, పోటీల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
హోటల్, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలకు సంబంధించిన వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సహోద్యోగుల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సి రావచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. దుర్గాష్టక పారాయణ శుభ ప్రదం.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో చిన్నారులు, ప్రియతముల వైఖరి ఆనందం కలిగిస్తుంది. సినిమా, టె లివిజన్ క్రీడలు, పాఠశాలల రంగాల వారికి ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వేడుకల్లో పాల్గొంటారు. గోమాత ఆరాధన శుభప్రదం.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ