Today Horoscope : ఈ రాశి వారు బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు.
ABN , Publish Date - Jan 01 , 2025 | 02:17 AM
నేడు (01-01-2024-బుధవారం ) వృత్తి, వ్యాపారాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.
నేడు (01-01-2024-బుధవారం ) వృత్తి, వ్యాపారాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
వృత్తి, వ్యాపారాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. సమావేశాలు, బృందకార్యక్రమాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. రాజకీయ, న్యాయ రంగాల వారు ఉన్నత పదవులు అందుకుంటారు. ఆర్థిక వ్యవహరాల్లో పెద్దల సహకారం లభిస్తుంది.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
సంకల్పం నెరవేరుతుంది.. రాజకీయ, సినీ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి వృత్తి, వ్యాపారాల్లో అనుకున్న పనులు సాధిస్తారు. పెద్దలతో చర్చలు ఫలిస్తాయి. శ్రీ రామచంద్ర మూర్తి ఆరాధన శుభప్రదం.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
ఆర్థికపరమైన వ్యూహాలు ఫలిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రక్షణ, బోధన, న్యాయ, రవాణా, రక్షణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. బంధుమిత్రులతో వేడుకలు, సంస్మరణల్లో పాల్గొంటారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
వ్యాపార లావాదేవీల్లో మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. పన్నులు, మ్యూచ్యువల్ పండ్స్, పెన్షన్ లావాదేవీలకు అనుకూమైన సమం.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
సమావేశాలు, వేడుకలు, విందులు ఉల్లాసం కలిగిస్తాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. అనుబంధాలు బలపడతాయి. కొత్త పరిచయాలు లక్ష్య సాధనకు తోడ్పడతాయి. వివాహ నిర్ణయాలకు అనుకూలం.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
వృత్తి, వ్యాపారాల్లో కొత్త పరిచయాలు లక్ష్య సాధనకు తోడ్పడతాయి. హోటల్, ఆస్పత్రులు, సేవల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ప్రియతముల ఆ రోగ్యం మెరుగుపడుతుంది.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
శుభకార్యాలు, వేడుకలకు సంబంధించిన నిర్ణయాలకు అనుకూలమైన రోజు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. చిన్నారుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. విద్యా సంస్థలు, చిట్‌ఫండ్‌లు, ప్రకటనల రంగాల వారికి ప్రోత్సాహకరం. ప్రయాణాలు ఫలిస్తాయి.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రుల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది. బదిలీలు, మార్పులకు సంబంధించిన సమాచారం అందుకుంటారు. పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. ఇంటికి అవసరమైన వస్తువులు రవాణాకు అనుకూలం. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు అందుకుంటారు. ఆర్థికపరమైన చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. సోదరీ సోదరుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. ప్రయాణాలకు ఏర్పాట్లు చే సుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది. పెట్టుబడులు, పొదుపు పథకాలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు. శ్రీ రామచంద్ర మూర్తిని ఆరాధించండి.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు మనసుకు ప్రశాంతత చేకూరుస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టి విజయం సాధిస్తారు.
మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాలకు సంబంధించి రహస్య సమాచారం అందుకుంటారు. దూరంలో ఉన్న ప్రియతముల కలయిక ఆనందం కలిగిస్తుంది. సినీ, రాజకీయ, న్యాయ, బోధన, విదేశీ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. వేడుకలు ఆనందం కలిగిస్తాయి.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ