Share News

Zodiac Signs: మీన రాశిలోకి శని.. ఈ 4 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..

ABN , Publish Date - Mar 11 , 2025 | 04:44 PM

Saturn in Pisces: శని స్థానచలనం పొందనున్నాడు. కుంభ రాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ ప్రభావం 12 రాశులపై ఉంటుంది. ముఖ్యంగా 4 రాశుల వారికి మేలు జరుగనుంది. మరి ఆ నాలుగు రాశులేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

Zodiac Signs: మీన రాశిలోకి శని.. ఈ 4 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
Saturn Transit to Pisces 2025

వేద గ్రంధాలు, జ్యోతిష్య శాస్త్రాలు శని దేవుడిని న్యాయ దేవుడిగా, కర్మ సిద్ధాంతాన్ని అమలు చేసే దేవుడిగా పేర్కొన్నాయి. వ్యక్తి కర్మల ఆధారంగా అతనిపై శని ప్రభావం ఉంటుందని అంటారు. శని సంచారం.. ఆయా రాశుల వారిపై అనేక విధాలుగా ప్రభావం చూపుతుందని జ్యోతిష్య నిపుణులు, వేద పండితులు చెబుతుంటారు. ఇది కొందరు వ్యక్తులకు అదృష్టాన్ని.. మరికొందరికి కష్టాలను కలిగిస్తుందని చెబుతారు. జ్యోతిష్యశాస్త్ర నిపుణుల ప్రకారం.. ప్రస్తుతం శని తన సొంత రాశి అయిన కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. అయితే, బలహీనమైన స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు శని స్థానచలనం పొందనున్నాడు. 29 మార్చి 2025న శని కుంభ రాశి నుంచి మీనరాశిలో స్థానచలనం పొందనున్నాడు. తద్వారా బృహస్పతి పాలనలో శని తన బలాన్ని తిరిగి పొందనున్నాడు. ఏప్రిల్ 6న పూర్తి స్థాయిలో మీనరాశిలో ప్రవేశిస్తాడు. ఈ స్థానచలనం.. 12 రాశిచక్రాలపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి గణనీయమైన లాభాలు, సానుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయని పండితులు చెబుతున్నారు. మరి శని స్థాన చలనం కారణంగా మేలు జరిగే ఆ నాలుగు రాశులు ఏంటో ఓసారి చూద్దాం..


1. వృషభం

మీన రాశిలోకి శని స్థానచలనం పొందడం కారణంగా వృషభ రాశిపై సానుకూల ప్రభావం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు. ఉద్యోగ నిపుణులు తమ ఆఫీస్‌లో సీనియర్ల మద్దతును పొందుతారు. కెరీర్‌లో వృద్ధి ఉంటుంది. వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలలో గణనీయమైన లాభాలను పొందుతారు.

2. తులా రాశి

శని గ్రహం స్థాన చలనం.. తుల రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఈ సమయంలో వారి కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. ఆస్తి సంపాదించే మార్గాలు కనిపిస్తాయి. మంచి గుర్తింపు లభిస్తుంది. చట్టపరమైన విషయాలు అనుకూలంగా మారే అవకాశం ఉంది. అయితే, కష్టపడి పని చేయడం ద్వారానే.. మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.


3. వృశ్చిక రాశి

శని గ్రహం మీనరాశిలో మారడం వల్ల వృశ్చికరాశి వారికి అదృష్టం వరించనుంది. కెరీర్‌, వ్యాపారంతో సహా జీవితంలో వివిధ అంశాలలో విజయం సాధించే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలనుకునే వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. దీర్ఘకాలిక ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఆర్థిక స్థిరత్వం, వృత్తిపరమైన ప్రయత్నాల్లో పురోగతిని సాధిస్తారు.

4. మకర రాశి

మీన రాశిలో శని గ్రహం స్థానచలనం పొందడం వల మకర రాశి వారికి ప్రయోజనం చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఎన్నాళ్లో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. కొత్త అనుభవాలు ఎదురవుతాయి. వ్యాపారవేత్తలు ఆర్థికంగా లాభాలు పొందుతారు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబంలో ఆనందం తాండవిస్తుంది.

గమనిక: పైన పేర్కొన్న వివరాలు జ్యోతిష్య నిపుణులు, వేదపండితులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు.


Also Read:

ఆ నలుగురి ఆత్మహత్య వెనుక కారణం ఇదే..

మా తడాఖా చూపిస్తా..: ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

రెండో రోజు శ్రీ చైతన్య కాలేజీలపై ఐటి సోదాలు..

For More Devotional News and Telugu News..

Updated Date - Mar 11 , 2025 | 04:44 PM