Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు చూశారా.. వారికి లక్కే లక్కు..
ABN , Publish Date - Jan 12 , 2025 | 08:34 AM
ఈ వారం అనుకూలదాయ కమే. వ్యవహారజయం, వాహనసౌఖ్యం ఉన్నాయి. స్థిరాస్తి ధనం అందుతుంది. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు.
మేషం
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ వారం అనుకూలదాయ కమే. వ్యవహారజయం, వాహనసౌఖ్యం ఉన్నాయి. స్థిరాస్తి ధనం అందుతుంది. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. పిల్లల చదువులపై దృష్టిపెడతారు. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి,మృగశిర 1,2 పాదాలు
మనోధైర్యంతో ముందుకు సాగుతారు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరు స్తాయి. అపజయాలకు కుంగిపోవద్దు. లక్ష్యాన్ని సాధించే వరకు శ్రమించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు. ఆత్మీయులను విందులు, వేడుకకు ఆహ్వానిస్తారు. ఆదివారం నాడు ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. చేపట్టిన పనులు ముందుకు సాగవు.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ప్రలోభాలకు లొంగవద్దు. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో పెట్టుబడులు తగదు. పెద్దల సలహా పాటించండి. కీలక పత్రాలు అందుకుంటారు. వేడుకకు హాజరవు తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
కర్కాటకం
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారాలతో తీరిక ఉండదు. అప్రమత్తంగా అడుగేయాల్సిన సమయం. అనాలోచిత నిర్ణయాలు తగవు. మీ సమ స్యలను ఆప్తులకు తెలియజేయండి. ఖర్చులు విపరీతం. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఆలో చనలు కార్యరూపం దాల్చుతాయి. ఉత్సా హంగా పనులు పూర్తి చేస్తారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. కార్య క్రమాలు వాయిదా వేసుకుంటారు. మీశ్రీమతి సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది.
సింహం
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లక్ష్యసాధనకు ఓర్పు, పట్టుదల ముఖ్యం. ఆశావహదృక్పఽథంతో మెలగండి. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. అవ కాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అను మానాలు, అపోహలకు తావివ్వవద్దు. శుక్ర, శనివారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. పోటీలు ఉల్లాసం కలిగిస్తాయి. జూదాలు, బెట్టింగ్‌లకు పాల్పడవద్దు.
కన్య
ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. అసాధ్యమనుకున్న పనులు సానుకూలమవు తాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. గృహం సందడిగా ఉంటుంది. సోమవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శుభవార్త వింటారు. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి.
తుల
చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
అన్ని విధాలా యోగదా యకమే. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. వేడుకలు, విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. పరిచయస్తులతో సంభా షిస్తారు. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. గురువారం నాడు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ప్రముఖుల జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
కార్యసిద్థికి ఓర్పు, పట్టుదల ప్రధానం. ఖర్చులు అదుపులో ఉండవు. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు చేజారిపోతాయి. ఇతరుల బాధ్యతలు తీసుకోవద్దు. మీ ఇష్టాలను సున్నితంగా తెలియజేయండి. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
రుణ విముక్తులై తాకట్టు విడి పించుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. పనులు వేగవంతమవుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. లక్ష్యాన్ని సాధించే వరకూ శ్రమించండి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. హామీలు నిలబెట్టుకుంటారు. ఆదివారం నాడు బాధ్యతలు అప్పగించి ఇబ్బంది పడతారు. సన్నిహితులను విందులకు ఆహ్వానిస్తారు. పోటీల్లో విజయం సాధిస్తారు.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
స్థిరాస్తి ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఆలోచనలు కార్య రూపం దాల్చుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. సోమ, మంగళ వారాల్లో ఆచితూచి అడుగేయాలి. ముఖ్య మైన వ్యవహారాల్లో తొందరపాటు తగదు. అనుభవజ్ఞులను సంప్రదించండి. పరిచయంలేని వారితో జాగ్రత్త. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సంయమనం పాటించండి. వేడుకల్లో పాల్గొంటారు.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
మీదైన రంగంలో మంచి ఫలి తాలున్నాయి. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యో న్ముఖులను చేస్తాయి. ఉత్సాహంగాముందుకు సాగుతారు. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. లక్ష్యం సాధించే వరకు శ్రమిం చండి. బుధవారం నాడు చేసిన పనులే చేయవలసి వస్తుంది. ఒక సమాచారం ఉప శమనం కలిగిస్తుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు.
మీనం
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
అనుకూలతలు అంతంత మాత్రమే. చిన్న విషయానికే చికాకుపడతారు. ఎవరినీ నిందించవద్దు. మనసుకు నచ్చిన వ్యక్తులతో కాలక్షేపం చేయండి. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. అవకాశాలు కలిసి వస్తాయి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. గురువారం నాడు అప్రమత్తంగా ఉండాలి. కీలక పత్రాలు అందుకుంటారు. ఆత్మీయులతో సంభాషిస్తారు.