Share News

మజిలీ దాటి మరో మజిలీ!

ABN , Publish Date - Jan 01 , 2025 | 05:40 AM

రెండు చక్రాలు దూరం భారం మోసినట్టు రెండు ముళ్ళు అనంత కాలాంబుధి ఈదుతాయి సజీవ హృదయాలపై భూత భవిష్యత్ వర్తమానాలు ప్రదర్శించే చలనమే కాలచక్రం...

మజిలీ దాటి మరో మజిలీ!

రెండు చక్రాలు

దూరం భారం మోసినట్టు

రెండు ముళ్ళు

అనంత కాలాంబుధి ఈదుతాయి

సజీవ హృదయాలపై

భూత భవిష్యత్ వర్తమానాలు

ప్రదర్శించే చలనమే కాలచక్రం

అంతం లేని కాలంలో

ఏ ఒక్క మజిలీలో

నిరాశతో మనిషి ఆగడు

ఆశల శ్వాసలు ఆశయాల ఘోషలు

మళ్ళీ మూటలు కట్టుకొని

లెక్కలు బేరీజు వేసుకొని

రేపటి మజిలీకి ఉవ్విళ్లూరతాడు

నిన్న మొన్నకి నేడు నిన్నకిలానే

రేపు నేటికి..

రేపన్న ఆశే మనిషి శ్వాస

వచ్చే కాలాన్ని పోయే కాలం

దైవంలా భావిస్తుంది అందుకే!

గతం నుండి నేర్చుకుంటూ

వర్తమానంలో జీవిస్తూ

భవిత దిద్దుకోడమే ప్రగతి లక్షణం!

– భీమవరపు పురుషోత్తమ్

Updated Date - Jan 01 , 2025 | 05:40 AM