Share News

రంగవల్లుల ముంగిలి

ABN , Publish Date - Jan 14 , 2025 | 12:33 AM

రంగవల్లుల ముంగిలి రంగు రంగుల ముగ్గులతో ముంగిలి పుత్తడిబొమ్మలా ముస్తాబైంది గొబ్బెమ్మల సొబగులతో వీధి మొత్తం ఇంద్ర ధనువులా...

రంగవల్లుల ముంగిలి

రంగవల్లుల ముంగిలి

రంగు రంగుల ముగ్గులతో ముంగిలి

పుత్తడిబొమ్మలా ముస్తాబైంది

గొబ్బెమ్మల సొబగులతో వీధి మొత్తం

ఇంద్ర ధనువులా కాంతివంతమైంది

బంధువుల రాకతో ఇల్లు మొత్తం

అలంకారపూరితమైంది

సేద్యపు యంత్రాంగం

పూజకు నోచుకుంటూ ఆనందించింది

కొత్త బట్టల కొంగొత్త శోభతో

పండుగ రోజు మిరుమిట్లు గొలిపింది

బసవన్నల రాకతో

గృహప్రాంగణం పావనమై వెలిగింది

హరిదాసుల ఆలాపనలో

మకర సంక్రమణం పులకించిపోయింది

పచ్చని పల్లెపట్టు ప్రకృతి యదపై

హాయిగా ఒదిగిపోయింది

చిరునవ్వుల వెలుగులు మొత్తం

పిల్లల మోములో కళలు పుట్టించింది

కోవెల భక్త బృందాల సందడితో

భక్తిగీతాలాపనతో మైమరచిపోయింది

ఐనవారి ఆగమనంలో

ఆనందం గాలిపటమై పైపైకెగసింది

నరెద్దుల రాజారెడ్డి

Updated Date - Jan 14 , 2025 | 12:34 AM