Share News

విశ్వమానవుడిగా వికసించాలి

ABN , Publish Date - Jan 01 , 2025 | 05:38 AM

ఎన్నో మిఠాయి పొట్లాలను ఎదలపై వదిలేసి వయ్యారంగా వెళ్ళిపోతుంది ఎన్నో కన్నీళ్లను చెక్కిళ్ళపై జారవిడిచి గుండెకు లోతైన గాయాలను చేసి...

విశ్వమానవుడిగా వికసించాలి

ఎన్నో మిఠాయి పొట్లాలను ఎదలపై

వదిలేసి వయ్యారంగా వెళ్ళిపోతుంది

ఎన్నో కన్నీళ్లను చెక్కిళ్ళపై జారవిడిచి

గుండెకు లోతైన గాయాలను చేసి

క్యాలెండర్ మార్చుకొని కాలగర్భంలో

కలిసిపోతుంది 2024 సంవత్సరం.

పోతూ పోతూ కొన్ని జీవిత పాఠాలను

నేర్పింది, కొన్నింటిని అలవాటు చేసింది

మనం కొన్నింటికి కామా పెట్టాలి

మరికొన్నింటికి ఫుల్‌స్టాప్‌ చుట్టాలి

మదిలో కొత్తదనానికి అంటు కట్టాలి

కొత్త సంవత్సరానికి స్వాగతం అంటే

చాటింగ్‌లు, గ్రీటింగ్‌లు, కేక్ కటింగ్‌లు కాదు

బీరు పొంగిచ్చుడు, బొక్క కొరుకుడు అంతకన్నా కాదు

భవిత కోసం బెర్తు భద్రంగా మలచుకోవాలి.

కులాల కంపు, మతాల మత్తును,

మనసులోని మలినాలను కడిగేసుకొని

మల్లెపువ్వులా మానవతా పరిమళాలను వెదజల్లుతూ

కొత్త సంవత్సరంలో విశ్వమానవుడిగా వికసించాలి.

తాటిపాముల రమేశ్ (తార)

Updated Date - Jan 01 , 2025 | 05:38 AM