Share News

కొత్తగా మొదలవ్వాలి

ABN , Publish Date - Jan 01 , 2025 | 05:36 AM

కొత్తగా సరికొత్తగా జీవితం మొదలవ్వాలి చిగురులు తొడుగుతూ రెక్కలు మొలిచినట్టు స్వేచ్ఛగా విహరించాలి బతుకును దుక్కులు దున్ని చదును చేసుకోవాలి...

కొత్తగా మొదలవ్వాలి

కొత్తగా సరికొత్తగా జీవితం మొదలవ్వాలి

చిగురులు తొడుగుతూ రెక్కలు మొలిచినట్టు

స్వేచ్ఛగా విహరించాలి

బతుకును దుక్కులు దున్ని చదును చేసుకోవాలి

మెట్ట, మాగాణి రంగులేసుకుని

పచ్చని పంటలు పండాలి

బీదాబిక్కి జనం గొంతులో

గుక్కెడు గంజి ఒంపుకోవాలి

ఆత్మగౌరవంగా బతకాలి

పిల్లపెద్ద, ముసలి ముతక స్ర్తీల బతుకుల్లో

ధైర్యం కాగడాల్లా దేశానికి వెలుగులు జిమ్మాలి

తాడిత పీడిత కులాలపై దాడులు లేకుండా

ఆధిపత్యం నశించి అగ్రకులాల సమాన భావన కలగాలి

ముగ్గుల్లో రంగులు కలిసినట్టు

మనుషుల్లో సోదర భావం కలవాలి

జాతులంతా వేరైనా మానవత్వం ఒకటై పండగసేయాలి

నూతనోత్సవం కొరకు

నూతన జీవితం మొదలెట్టాలి

ఎప్పుడూ నిత్యనూతనంగా మనుషులు బతకాలి

దేశమంతా వెలుగుల వేడుకలు చేయాలి.

తంగిరాల సోని

Updated Date - Jan 01 , 2025 | 05:36 AM