ఈ వారం వివిధ కార్యక్రమాలు 6-01-2025
ABN , Publish Date - Jan 06 , 2025 | 12:17 AM
తానా నవలల పోటీ, అలిశెట్టి పురస్కారం...
తానా నవలల పోటీ
జులై 3, 4, 5 తేదీలలో డిట్రాయిట్‌లో జరుగనున్న తానా మహాసభల సందర్భంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) రెండు లక్షల బహుమతితో నిర్వహిస్తున్న నవలల పోటీలో పాల్గొనవలసిందిగా తెలుగు రచయితలను కోరుతున్నాం. నవలలు తెలుగు జీవితాన్ని ప్రతిబింబించాలి, పేజీల పరిమితి లేదు. వీలైనంతవరకు డిటిపి చేసి పంపాలి. నవలలపై రచయిత పేరు, చిరునామా ఉండకూడదు. కవరింగ్ లెటర్‌పై మాత్రమే ఉండాలి. మీ రచనలను ఏప్రిల్ 15లోగా ఈమెయిల్ tana.novel.2025@gmail.comకు, లేదా పోస్టులో చిరునామా: అక్షర క్రియేటర్స్, ఎజి–2, ‘ఎ’ బ్లాక్, మాతృశ్రీ అపార్ట్‌మెంట్స్, హైదర్‌గూడ, హైదరాబాద్–500029కు పంపాలి. మరిన్ని నిబంధనల వివరాలకు ఫోన్: 98493 10560.
నిరంజన్ శృంగవరపు
అలిశెట్టి పురస్కారం
తెలంగాణ రచయితల వేదిక కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అలిశెట్టి ప్రభాకర్ రాష్ట్రస్థాయి సాహిత్య పురస్కారం 2024ను కవి బెల్లి యాదయ్యకు జనవరి 12 ఉదయం కరీంనగర్ ఫిలిం భవన్‌లో ప్రదానం చేయనున్నారు. అల్లం నారాయణ, నారదాసు లక్ష్మణరావు, నలమెల భాస్కర్, కొండి మల్లారెడ్డి, బూర్ల వెంకటేశ్వర్లు, అన్నవరం దేవేందర్, గాజోజు నాగభూషణం, నగునూరి శేఖర్ తదితరులు హాజరవుతారు.
సి.వి. కుమార్