ISRO: ఇస్రోలో ఉద్యోగాలు..ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అభ్యర్థులకు మంచి ఛాన్స్..
ABN , Publish Date - Mar 31 , 2025 | 08:07 PM
మీరు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో పనిచేయాలని చూస్తున్నారా. అయితే మీకు శుభవార్త. ఎందుకంటే ఈ సంస్థలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)లో జాబ్ చేయాలని అనేక మందికి కోరిక ఉంటుంది. అలాంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఎందుకంటే ఇటీవల ఇస్రోలో 75 అప్రెంటిస్ ట్రైనీ రిక్రూట్‌మెంట్ పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదలైంది. దీని కోసం అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి అప్లికేషన్లను ఆహ్వానించారు.
ఇస్రో అప్రెంటిస్ ట్రైనీ రిక్రూట్‌మెంట్ 2025
75 పోస్టులు వివిధ విభాగాల్లో ఉన్నాయి. వాటిలో గ్రామీణ అభ్యర్థులకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ నియామకానికి సంబంధించి ముఖ్యమైన వివరాలను ఇప్పుడు చూద్దాం.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ (Graduate Apprentice Trainee): 46 పోస్టులు
డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీ (Diploma Apprentice Trainee): 15 పోస్టులు
డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ (Diploma in Commercial Practice): 5 పోస్టులు
ట్రేడ్ ఐటీఐ (Trade ITI): 9 పోస్టులు
విద్యా అర్హత:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ (Graduate Apprentice Trainee):
సంబంధిత విభాగంలో BE/B.Tech పట్టా (అవసరమైన సబ్జెక్టుల్లో)
అర్హత కలిగిన అభ్యర్థులు 2022, 2023, 2024 సంవత్సరాల్లో ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి
డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీ (Diploma Apprentice Trainee):
సంబంధిత రంగంలో రాష్ట్ర బోర్డు ద్వారా జారీ చేయబడిన ఇంజనీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి
2022, 2023, 2024 సంవత్సరాల్లో డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు
డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ (Diploma in Commercial Practice):
సంబంధిత రంగంలో గుర్తింపు పొందిన రాష్ట్ర బోర్డు ద్వారా జారీ చేయబడిన డిప్లొమా
2022, 2023, 2024 సంవత్సరాల్లో డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు
ట్రేడ్ ఐటీఐ (Trade ITI):
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా ఇన్స్టిట్యూట్ నుంచి సంబంధిత సబ్జెక్టులో ఐటీఐ
ఎంపిక ప్రక్రియ:
ఇస్రో అప్రెంటిస్ ట్రైనీ ఎంపిక ప్రక్రియ ముఖ్యంగా 2 దశల్లో జరుగుతుంది
డాక్యుమెంట్ వెరిఫికేషన్ / స్క్రీనింగ్
అభ్యర్థుల అర్హతను పరిశీలించి, వారి శిక్షణకు సంబంధించి ధృవపత్రాలను వెరిఫై చేస్తారు
ఇంటర్వ్యూ:
డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత, అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు.
అభ్యర్థుల అకడమిక్ మార్కులు, ఇంటర్వ్యూలో వారి పనితీరు ఆధారంగా జాబితా రూపొందిస్తారు
ఈ జాబితా ఆధారంగా, అభ్యర్థులను శిక్షణ కోసం ఎంపిక చేస్తారు
గమనిక: ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే తెలియజేస్తారు. అభ్యర్థుల ఎంపిక తరువాత, వారు డాక్యుమెంట్ వెరిఫికేషన్, పరిశీలన కోసం ఇస్రో కార్యాలయానికి వెళ్ళాలి. అటు, ఖర్చులపై ప్రయాణ భత్యం కూడా అందిస్తారు.
ఎందుకు ఇస్రోలో పనిచేయాలి?
ఇస్రోలో పనిచేసేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో పేరున్న సంస్థ, ఇస్రో ప్రత్యేకమైన శిక్షణ, అద్భుతమైన వేతనం, జీవితకాల అవకాశాలను అందిస్తుంది. ఇస్రోలో పనిచేస్తే, నూతన సాంకేతికతలను నేర్చుకునే అవకాశం, అంతరిక్ష పరిశోధనలో పాలుపంచుకునే అవకాశం, అలాగే ఇతర ప్రత్యేక అవకాశాలు కూడా లభిస్తాయి.
దరఖాస్తు ప్రాతిపదిక:
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: ఏప్రిల్ 21, 2025.
అభ్యర్థులు ఈ తేదీ లేదా అంతకు ముందు తమ దరఖాస్తులను సమర్పించాలి.
దరఖాస్తు ప్రక్రియ ఆఫ్‌లైన్ ద్వారా జరగనుంది. సంబంధిత ఫారమ్‌ను ISRO అధికారిక వెబ్‌సైట్ లేదా స్థానిక కార్యాలయాల ద్వారా పొందవచ్చు
ఇస్రో అధికారిక వెబ్‌సైట్: https://www.isro.gov.in
స్టైపెండ్
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు ప్రతి నెలా రూ. 9000 స్టైఫండ్ ఇవ్వబడుతుంది. టెక్నీషియన్ అప్రెంటిస్‌లకు నెలకు రూ. 8,000 స్టైఫండ్ లభిస్తుంది. ETI ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు ప్రతి నెలా రూ. 7,000 స్టైఫండ్ అందజేస్తారు.
ఇవి కూడా చదవండి:
Indian Navy: టెన్త్ క్లాస్ పాసై, ఈత వస్తే చాలు..నెలకు రూ.80 వేల జీతం, ఇప్పుడే అప్లై చేయండి..
Income Tax Changes: ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త పన్ను రేట్లు తెలుసుకోండి..మనీ సేవ్ చేసుకోండి..
Railway Jobs: రైల్వేలో 9,970 పోస్టులకు నోటిఫికేషన్..అప్లై చేశారా లేదా..
Read More Business News and Latest Telugu News