NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
ABN , Publish Date - Mar 21 , 2025 | 05:09 PM
ప్రస్తుత ట్రెండ్ దృష్ట్యా ఏఐ నైపుణ్యాలను నేర్చుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. ఎందుకంటే వచ్చే రెండేళ్లలో దాదాపు లక్ష మంది విద్యార్థులకు ఏఐ నైపుణ్యాలను నేర్పించనున్నట్లు నాస్కామ్ తెలిపింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

ప్రపంచవ్యాప్తంగా ఏఐ ట్రెండ్ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇండియాలో నాస్కామ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా నైపుణ్యాలు నేర్చుకునేందుకు లక్ష మందికి పైగా విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో నాస్కామ్, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) సంయుక్తంగా స్నోఫ్లేక్‌తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీంతో ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ ప్లాట్ ఫాం ద్వారా విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు ప్రకటించారు.
ఏఐ శిక్షణకు డిమాండ్
ఇందులో, స్నోఫ్లేక్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యున్నత డేటా, AI నైపుణ్యాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తుంది. స్నోఫ్లేక్ తమ గ్లోబల్ ప్రోగ్రామ్ వన్ మిలియన్ మైండ్స్ + వన్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ ప్రయత్నానికి సపోర్ట్ చేస్తుంది. ఇది భారతదేశంలో AI నైపుణ్యాల అవసరం పెరిగిన నేపథ్యంలో రూపొందించబడింది. ప్రస్తుతం AI నిపుణుల డిమాండ్, సరఫరా మధ్య కొంత గ్యాప్ ఉంది. నాస్కామ్ ప్రకారం, ప్రస్తుతం దేశంలో AI నిపుణుల అవసరం సుమారు 51 శాతం పైగా ఉంటుంది. 2026 నాటికి ఈ అవసరం మరింత పెరిగి, 10 లక్షల మందికి పైగా AI నిపుణులు అవసరం అవుతారని అంచనా వేస్తున్నారు.
విద్యార్థులకు అద్భుతమైన అవకాశాలు
ఈ క్రమంలో AI, డేటా సైన్స్, ML (మెషిన్ లెర్నింగ్) వంటి రంగాలలో నైపుణ్యం కలిగిన నిపుణుల డిమాండ్ ఎక్కువగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే, డేటా ఇంజనీరింగ్, డేటా సైన్స్ వంటి విభాగాల్లో అత్యధిక నైపుణ్యం కలిగినవారు కావాలని అనేక కంపెనీలు కోరుతున్నాయి. ఈ ఒప్పందంతో స్నోఫ్లేక్, నాస్కామ్ దాదాపు లక్ష మంది విద్యార్థులకు ప్రొఫెషనల్ ఆన్-డిమాండ్, ఉచిత AI కోర్సులను అందిస్తాయి.
ఫ్యూచర్ స్కిల్స్
ఈ కోర్సులు విద్యార్థుల కెరీర్‌ను మెరుగుపరచుకునేందుకు ఎంతో ఉపయోగపడనున్నాయి. ఎంట్రీ-లెవల్ నైపుణ్యాలపై ధ్యాస పెట్టిన ఈ కోర్సులు డిగ్రీ, డిప్లొమా విద్యార్థులు కూడా నేర్చుకోవచ్చని చెబుతున్నారు. ఈ కోర్సులను ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ అనే ప్లాట్‌ఫామ్ ద్వారా అందించనున్నారు. ఈ శిక్షణతో విద్యార్థులు డేటా విశ్లేషణ, డేటా ఆర్కిటెక్చర్, AI/ML మోడల్స్ వంటి అంశాలలో నైపుణ్యాలను పెంచుకునే అవకాశం ఉంది.
ఈ శిక్షణ కోర్సులు భారతదేశ జాతీయ విద్యా విధానం (NEP) 2020కు అనుగుణంగా రూపొందించబడ్డాయి. విద్యార్థులు ఈ కోర్సులను తప్పనిసరి లేదా ఐచ్ఛిక పాఠ్యాంశాలుగా తమ ప్రోగ్రాములలో చేర్చుకోవచ్చు. అంతేకాకుండా ఈ కోర్సులు వారిపై పరిశీలనాత్మక దృష్టిని పెంచి, సమకాలీన డేటాను విజయవంతంగా వ్యవహరించే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి.
ఇవి కూడా చదవండి:
Viral News: కారు డ్రైవర్‌తో లొల్లి..రోడ్డు మధ్యలో నిలబడి ట్రాఫిక్ అడ్డుకున్న బైకర్
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News