Share News

Health: రాత్రి పడుకునే ముందు రీల్స్ చూస్తారా? ఎంత ప్రమాదమో తెలిస్తే..

ABN , Publish Date - Jan 13 , 2025 | 08:17 PM

రాత్రి పడుకునే ముందు రీల్స్, షార్ట్ వీడియోలు చూసే అలవాటు ఉన్న వారికి బీపీ వచ్చే అవకాశాలు ఎక్కువని చైనా పరిశోధకులు తాజాగా గుర్తించారు. ఈ అధ్యయనం తాలూకు వివరాలు బీఎమ్‌సీ జర్నల్‌లో తాజాగా ప్రచురితమయ్యాయి.

Health: రాత్రి పడుకునే ముందు రీల్స్ చూస్తారా? ఎంత ప్రమాదమో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: నేటి సోషల్ మీడియా జమానాలో జనాలకు రీల్స్ చూడటం ఓ వ్యసనంగా మారింది. కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు.. స్మార్ట్ ఫోనులో రీల్స్, షార్ట్ వీడియోలు చూడటంలో మునిగిపోతున్నారు. ఇది జనాలకు ఓ వ్యసనంగా మారిందని అనేక మంది గగ్గోలు పెడుతున్నారు. ఇది ఈ వ్యసనంతో సమయం వృథా కావడమే కాకుండా చివరకు బీపీ కూడా వస్తుందని తాజా అధ్యయనంలో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇటీవల బీఎమ్‌సీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి (Health).

చైనాలోని హేబేయ్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న 4318 మంది తాము రోజూ రాత్రిళ్లు ఎంత సేపు రీల్స్ చూసి పడుకుంటోంది స్వయంగా పరిశోధకులకు తెలియజేశారు. జనవరి నుంచి సెప్టెంబర్ 2023 మధ్య ఈ అధ్యయనం నిర్వహించారు. అనంతరం, వారికి పలు రకాల పరీక్షలు నిర్వహించారు. రాత్రిళ్లు నిద్రపోయే ముందు జనాలు స్మార్ట్‌ఫోన్లల్లో ఎంత సేపు రీల్స్, షార్ట్ వీడియోలు చూస్తున్నారనే అంశాన్ని పరిశోధకులు ఈ అధ్యయనంలో పరిశీలించారు.


Health: అతిగా నవ్వితే మరణం! కారణాలు ఇవే!

ఈ క్రమంలో వైద్యులు పలు సంచలన విషయాలను గుర్తించారు. రాత్రిళ్లు ఎక్కుసేపు రీల్స్, షార్ట్ వీడియోలు చూస్తూ గడిపేవారిలో బీపీ వచ్చే ఛాన్స్ బాగా పెరిగినట్టు గుర్తించారు. యువతతో పాటు మధ్య వయస్కులు ఈ ప్రమాదం ఎక్కువగా ఎదుర్కుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ అలవాటుతో మెదడులోని సింపాథిటిక్ నాడీ వ్యవస్థ కూడా క్రియాశీలకం అవుతూ అవాంఛనీయ పరిణామాలకు దారి తీస్తున్నట్టు గుర్తించారు.

Boiled Egg Vs Omlette: ఉడకబెట్టిన గుడ్డు వర్సెస్ ఆమ్లెట్.. వీటిల్లో ఏది బెటరంటే..


ఈ పరిస్థితి ప్రమాదకరమని హెచ్చరించిన శాస్త్రజ్ఞులు రాత్రిళ్లు వీలైనంత తక్కువగా, కుదిరితే అసలు రీల్స్ చూడొద్దని సూచించారు. వీటితో పాటు బరువును అదుపులో ఉంచుకోవడం, రక్తంలో కొవ్వులు, చక్కెరల స్థాయిలో నియంత్రణలో ఉండేలా చూసుకుంటే బీపీ వచ్చే అవకాశాలు తగ్గించుకోవచ్చని అన్నారు.

ఈ విషయాన్ని బెంగళూరుకు చెందిన డాక్టర్ దీపక్ కృష్ణమూర్తి నెట్టింట పోస్టు చేశారు. రీల్స్, షార్ట్ వీడియోలతో దృష్టిమళ్లడమే కాకుండా చివరకు బీపీ కూడా వస్తుందని పేర్కొన్నారు. వెంటనే ఈ అలవాటును మానుకోవాలని హెచ్చరించారు.

Smoking: రోజుకు ఒక్క సిగరెట్ తాగితే ఏం కాదని అనుకుంటున్నారా? ఇది ఎంతటి ప్రమాదమో తెలిస్తే..

Read Latest and Health News

Updated Date - Jan 13 , 2025 | 08:42 PM