Health Tips: పురుషుల్లో ఆ సమస్యకు కారణమిదేనట..
ABN , Publish Date - Apr 20 , 2025 | 08:50 PM
ప్రస్తుత కాలంలో చాలా మంది పురుషులు తప్పుడు జీవనశైలి కారణంగా అనారోగ్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా వయసు పెరిగే కొద్ది రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. హార్మోన్ల అసమతుల్యత, విటమిన్ లోపం తదితర కారణాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుత కాలంలో చాలా మంది పురుషులు తప్పుడు జీవనశైలి కారణంగా అనారోగ్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా వయసు పెరిగే కొద్ది రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. హార్మోన్ల అసమతుల్యత, విటమిన్ లోపం తదితర కారణాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల కారణంగా త్వరగా అలసిపోవడం, తీవ్రమైన బలహీనతతో ఇబ్బందులు పడుతున్నారు. వైద్య నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. వయసు పెరిగే కొద్ది స్త్రీల మాదిరిగానే.. పురుషుల్లోనూ హార్మోన్ల మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా 40 నుంచి 50 సంవత్సరాల తరువాత పురుషుల శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఫలితంగా పురుషులు బలహీనంగా మారుతుంటారు.
వైద్య పరిభాషలో.. టెస్టోస్టెరాన్ లోపాన్ని హైపోగోనాడిజం అంటారు. వయసు పెరిగే కొద్దీ పురుషుడి శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ పరిమాణం తగ్గడం ప్రారంభమవుతుంది. ఈ హార్మోన్ లోపం వల్ల శరీరంలో మానసిక, శారీరక మార్పులు కనిపిస్తాయి. ఈ హార్మోన్ లోపం 40 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల పురుషులలో కనిపిస్తుంది.
టెస్టోస్టెరాన్ హార్మోన్ లోపం లక్షణాలు..
మానసిక స్థితిలో మార్పులు కనిపిస్తాయి.
నిద్రలో మార్పులు.
నిరంతరం విచారంగా ఉండటం.
శరీరక బలహీనత.
అలసిపోయినట్లు అనిపించడం.
అధిక చెమట.
ఎలాంటి ఆహారం తీసుకోవాలి
40 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల పురుషులు కాల్షియం అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. పాలు, నువ్వులు, గింజలు, గుడ్లు, చేపలు, బ్రోకలీ వంటివి తినాలి.
ఆరోగ్యకరమైన కొవ్వులు
కొవ్వు ఆమ్లాలు తీసుకోవడం వల్ల టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఈ కొవ్వు ఆమ్లాల కోసం మీరు తినే ఆహారంలో గింజలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, మాంసం, నెయ్యి చేర్చుకోవడం ఉత్తమం.
జింక్
జింక్ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల టెస్టోస్టెరాన్‌తో సహా హార్మోన్లు సమతుల్యం అవుతాయి. జింక్ కోసం ఆహారంలో బీన్స్, గింజలు, డార్క్ చాక్లెట్ తీసుకోవచ్చు.
గమనిక: పైన తెలిపిన వివరాలు వైద్య నిపుణులు అందించిన సమాచారం ప్రకారం, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే.. ముందుగా వైద్యులను సంప్రదించి.. వారి సలహాలు, సూచనలు పాటించడం ఉత్తమం.
Also Read:
డోపింగ్ ప్రకంపనలు.. రమేశ్ నాగపురి రియాక్షన్
బాత్‌రూమ్‌లో ఫోన్ వాడతారా.. అయితే తప్పక
విమానం జాప్యంపై సీఎంకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ వివరణ
For More Health News and Telugu News..