Sunscreen Buying Tips: చర్మతత్వాన్ని బట్టి సన్‌స్క్రీన్ ఎంచుకోవాలా.. అవసరం లేదా..
ABN , Publish Date - Mar 19 , 2025 | 05:14 PM
Sunscreen Buying Tips: మండే ఎండలు మీ సున్నితమైన చర్మాన్ని దెబ్బతీయకూడదంటే సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడం చాలా అవసరం. అప్పుడే ఎండ వేడిమి మీ చర్మంపై నేరుగా ప్రభావం చూపించదు. కాకపోతే మీ చర్మతత్వాన్ని బట్టి సరైన సన్‌స్క్రీన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎవరు ఎలాంటివి ఎంపిక చేసుకోవాలో ఇప్పుడు చెప్పుకుందాం.

Sunscreen Buying Tips: ఇప్పటికే ఎండలు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. అధికవేడి కారణంగా మధ్యాహ్న సమయాల్లో అడుగుబయటపెట్టేందుకే ప్రజలు భయపడుతున్నారు. ఇలాంటి కాలంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే ఈ జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం. వేసవిలో సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు (యూవీ) మీ చర్మానికి హాని కలిగించకుండా సన్‌స్క్రీన్ కాపాడుతుంది. అయితే, మీ స్కిన్ రకం ఎలాంటిది.. ఎలాంటి ప్రాంతంలో జీవిస్తున్నారు.. ఎండలో ఎంతసేపు గడుపుతారు.. ఇలాంటి అనేక అంశాలు పరిగణనలోకి తీసుకుని మీరు సన్‌స్క్రీన్ కొనుగోలు చేయాలి. సరైనది ఎంపిక చేసుకోకపోతే స్కిన్ డ్యామేజ్ అవడం ఖాయం..
ఎంత SPF ఉన్న సన్‌స్క్రీన్‌ను కొనాలో చాలామందికి అవగాహన ఉంటుంది. కానీ, మీ చర్మ రకాన్ని బట్టి ఎలాంటిది ఎంచుకోవాలో మీకు కచ్చితంగా తెలుసా? కింద ఇచ్చిన సమాచారం ఆధారంగా ఏ చర్మ రకానికి ఎలాంటి సన్‌స్క్రీన్‌ను ఉపయోగించాలో తెలుసుకోండి.
పొడి చర్మం:
పొడి చర్మం ఉన్నవారు మరో ఆలోచన లేకుండా ఎల్లప్పుడూ క్రీమ్ బేస్డ్ లేదా మాయిశ్చరైజింగ్ సన్‌స్క్రీన్‌ను మీ దగ్గర ఉంచుకోండి. హైలురోనిక్ యాసిడ్, విటమిన్ E కలిగిన సన్‌స్క్రీన్ ప్రొడక్ట్స్ మాత్రమే కొనాలని గుర్తుపెట్టుకోండి. ఇవి మీ చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. మాకు ఏ సన్‌స్క్రీన్ మంచిదో తెలియదు. మా చర్మానికి ఇది సరిపడట్లేదు అనుకుంటే కోకోవా బట్టర్ లేదా కలబంద ఉన్న సన్‌స్క్రీన్‌ను కొనండి.
జిడ్డు చర్మం:
మీ చర్మం జిడ్డుగా ఉంటే జెల్ ఆధారిత లేదా మ్యాట్ ఫినిష్ సన్‌స్క్రీన్‌ను ఎంచుకోవాలి. ఈ రెండు రకాల సన్‌స్క్రీన్‌లు ముఖంపై అదనపు నూనెలు ఉత్పత్తి కాకుండా నియంత్రిస్తాయి. సన్‌స్క్రీన్ కొనుగోలు చేసేటప్పుడు నూనె లేని నాన్ కామెడోజెనిక్ ఫార్ములా ఉన్నవే ఎంచుకోండి. దీన్ని ఉపయోగించడం వల్ల ముఖ రంధ్రాలు మూసుకుపోతాయనే భయం ఉండదు.
సాధారణ చర్మం:
మీ చర్మం సాధారణంగా ఉంటే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. మీరు తేలికైన వాటర్ బేస్డ్ సన్‌స్క్రీన్‌ను ఉపయోగించవచ్చు. సాధారణ చర్మం ఉన్నవారు వారి సన్‌స్క్రీన్‌లో కలబంద లేదా గ్రీన్ టీ ఫ్లేవర్స్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
మొటిమల చర్మం:
మీరు మొటిమలతో ఇబ్బంది పడుతుంటే సన్‌స్క్రీన్ కొనే ముందు ఆలోచించాలి. కొనాలనుకుంటే నాన్-కామెడోజెనిక్, ఆయిల్ ఫ్రీ సన్‌స్క్రీన్ కొనండి. సాలిసిలిక్ యాసిడ్, నియాసినమైడ్ కలిగిన సన్‌స్క్రీన్‌లు అయితే మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి.
సున్నితమైన చర్మం:
సున్నితమైన చర్మం ఉన్నవారు సన్‌స్క్రీన్ కొనే ముందు చాలా ఆలోచించాలి. సాధారణ సన్‌స్క్రీన్‌లలో ఉండే రసాయనాలు మీ చర్మానికి హాని కలిగించవచ్చు. కాబట్టి కెమికల్స్, మినరల్స్ లేని సన్‌స్క్రీన్‌ను ఎంచుకోండి. జింక్ ఆక్సైడ్, టైటానియం డయాక్సైడ్ ఉండే సన్‌స్క్రీన్లు సున్నితమైన చర్మం ఉన్నవారికి సరైన ఎంపిక.
Read Also : Beauty Tips: ఖరీదైన క్రీములు..పార్లర్ ట్రీట్మెంట్లు అవసరమే లేదు..ఈ చిన్న
Alcohol Drinking : మద్యం అలవాటు పోవాలంటే.. ఈ ఒక్క డ్రింక్ చాలు..
Reduce Obesity Tips: ఊబకాయాన్ని తగ్గించుకోనేందుకు.. జస్ట్ ఈ చిట్కాలు..