Army plane crash: ఆ దేశంలో ఘోర ప్రమాదం.. కళ్లుమూసి తెరిచే లోపే..
ABN , Publish Date - Feb 26 , 2025 | 08:11 AM
సూడాన్ దేశం వాది సీద్నా ఎయిర్ బెస్‌లో ఘోర ప్రమాదం సభవించింది. విమానం టేకాఫ్‌లో సమస్యలు తలెత్తడంతో క్షణాల్లోనే కూలిపోయింది.

ఖార్టూమ్: సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం (Plane Crash) జరిగింది. మిలటరీ విమానం కూపిపోయి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖార్టూమ్ (Khartoum) సమీపంలోని వాది సీద్నా ఎయిర్ బెస్ (Wadi Seidna Air Base) నుంచి మంగళవారం రాత్రి ఆర్మీ ఫ్లైట్ బయలుదేరేందుకు సిద్ధమైంది. అయితే రన్ వేపై పరుగులు పెట్టిన విమానం.. టేకాఫ్ అవుతూ ఒక్కసారిగా కుప్పకూలింది.
ఈ ప్రమాదంలో మెుత్తం 10 మృతిచెందగా.. వారిలో ఆర్మీ అధికారులు, సాధారణ పౌరులు ఉన్నారు. అలాగే పలువురికి గాయాలు అయ్యాయి. అప్రమత్తమైన అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. విమానానికి మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు. కాగా, టేకాఫ్‌లో సమస్యలు కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు అమెరికాలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది.
చికాగోలోని మిడ్‌వే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో సౌత్ వెస్ట్‌కు చెందిన విమానం ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించింది. అయితే అదే సమయంలో రన్ వేకు అడ్డంగా మరో ప్రైవేట్ జెట్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన సౌత్ వెస్ట్ ఫైలట్ వెంటనే విమానాన్ని మళ్లీ గాల్లోకి లేపాడు. ఫైలట్ అప్రమత్తంగా లేకుండా ఘోర ప్రమాదం జరిగి ఉండేది. ఇప్పటికే అమెరికాలో పలు విమాన ప్రమాదాలు వందల సంఖ్యలో ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేశాయి. కాగా, ప్రమాదం తప్పించిన ఫైలట్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
KSRTC bus conductor: కర్ణాటక, మహారాష్ట్ర మధ్య తిరగని సర్వీసులు
Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం ధరలు..