Share News

Viral Video: నువ్వు నిజంగా హీరోవి బాసు.. కత్తికి కూడా భయపడలేదు..

ABN , Publish Date - Apr 01 , 2025 | 08:40 AM

ఆ వ్యక్తి అప్పటికే ఓ ఐదు మందిని కత్తితో దారుణంగా పొడిచాడు. మిగిలిన వారిని కూడా పొడవటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. జనం భయంతో పరుగులు తీస్తున్నారు. కేకలు వేస్తూ ఉన్నారు. అప్పుడు ఓ యువకుడు హీరోలా అక్కడికి వచ్చాడు. ప్రాణాలకు తెగించి ఆ వ్యక్తితో పోరాడాడు.

Viral Video: నువ్వు నిజంగా హీరోవి బాసు.. కత్తికి కూడా భయపడలేదు..
British Hero Of Amsterdam

మీరు నడుచుకుంటూ వెళుతున్న వీధిలో ఓ వ్యక్తి కత్తితో మనుషులపై దాడి చేస్తున్నాడు అనుకుందాం. అప్పుడు మీరు ఏం చేస్తారు?.. భయంతో అక్కడినుంచి పరుగులు తీస్తారా?.. లేక కత్తితో జనాల్ని పొడుస్తున్న వ్యక్తిపై పోరాడతారా?.. నూటికి 99 శాతం మంది అయితే.. ప్రాణ భయంతో పరుగులు పెడతారు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో ఓ యువకుడు మాత్రం.. కత్తితో మనుషులపై దాడి చేస్తున్న వ్యక్తితో పోరాడాడు. హీరోలాగా అతడ్ని ఓడించి, నేలపై పడుకోబెట్టాడు. ఈ సంఘటన నెథర్లాండ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


కొద్దిరోజుల క్రితం నెథర్లాండ్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో ఉక్రేనియాకు చెందిన ఓ వ్యక్తి.. వీధిలో నడుచుకుంటూ వెళుతున్న వారిపై కత్తితో దాడికి దిగాడు. దాదాపు ఐదు మందిపై కత్తితో దాడి చేశాడు. దీంతో జనం భయంతో పరుగులు పెట్టారు. గట్టిగా అరవటం మొదలెట్టారు. ఈ అరుపులు విన్న ఓ 30 ఏళ్ల యువకుడు అటువైపు చూశాడు. కత్తితో మనుషులపై దాడి చేస్తున్న వ్యక్తి కనిపించాడు. వెంటనే అతడి దగ్గరకు పరుగులు పెట్టాడు. కత్తి ఉందన్న భయం ఏ మాత్రం లేకుండా అతడితో పోరాడాడు. హీరోలాగా ఫైట్ చేసి అతడ్ని మట్టికరిపించాడు. నేలపై పడుకోబెట్టేశాడు. జనం ఆ దుండగుడ్ని కొట్టడానికి వస్తే.. యువకుడు ఒప్పుకోలేదు.


పోలీసులు వచ్చేంత వరకు అతడ్ని వారినుంచి రక్షించాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి వచ్చిన పోలీసులు దుండగుడ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. యువకుడు కత్తితో ఉన్న వ్యక్తితో పోరాటం చేసి మట్టికరిపించిన దృశ్యాల తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూస్తున్న నెటిజన్లు ఆ యువకుడి ధైర్య సాహసాలకు సెల్యూట్ చేస్తున్నారు. ‘బ్రిటీష్ హీరో ఆఫ్ ఆమ్‌స్టర్‌డామ్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ‘ సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్‌లు వేస్టు. వారందరూ రీల్ హీరోలు.. నువ్వు రియల్ హీరో’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ఈ కుర్రాడు రియల్ హీరో!


ఇవి కూడా చదవండి:

Stock Market: Today ఇవాళ మార్కెట్ ఎటువైపు.. పైకా, కిందికా

Chandrababu Model Village: ఇది నారా వారి ఊరు

Updated Date - Apr 01 , 2025 | 08:51 AM