Earthquake In Myanmar: మయన్మార్‌లో భూకంపం.. థాయ్‌లాండ్‌లో ఎమర్జెన్సీ
ABN , Publish Date - Mar 28 , 2025 | 01:59 PM
మయన్మార్‌లో సంభవించిన భూకంపం తీవ్రత థాయ్‌లాండ్‌ను కుదిపేసింది. భూకంప తీవ్రతకు బ్యాంకాక్‌లోని బిల్డింగ్‌లు నేలమట్టం అయ్యాయి. జనాలు భయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు.

వరుస భూకంపాలు మయన్మార్‌ను కుదిపేశాయి. నేడు (శుక్రవారం) సంభవించిన రెండు భూకంపాలు.. మయన్మార్‌తో పాటుగా.. థాయ్‌ల్యాండ్ రాజధాని బ్యాంకాక్‌ను వణికించాయి. రిక్టార్ స్కేల్ మీద రెండు భూకంపాల తీవ్రత 7.4, 6.8 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. భూకంప ధాటికి మయన్మార్ మండలేలోని ఐకానిక్ అవ బ్రిడ్జ్ దగ్గరలోని ఇర్రవడ్డి నదిలో కూలిపోయింది. భూకంప ధాటికి పలు బిల్డింగ్ కుప్పకూలిపోయాయి. భూకంప కేంద్రం సాగింగ్ సమీపంలో ఉంది. దాంతో థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో అత్యవసర పరిస్థితి విధించారు.
మయన్మార్‌లో సంభవించిన భూకంపాలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే.. వాటికి ధాటికి.. థాయ్ రాజధాని బ్యాంకాక్‌కు 900 కిమీ దూరంలో ఉన్న ప్రాంతంలోని అతి పెద్ద భవనం ఒకటి కుప్ప కూలింది. సుమారు 40 మంది ఇక్కడ చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భూకంప తీవ్రతకు భవనాలు షేక్ అవుతున్నాయి. దాంతో జనాలు భయంతో రోడ్ల మీదకు పరుగులు తీస్తున్నారు.
థాయ్‌ల్యాండ్‌లో మాత్రమే కాక.. చైనాలోని నైరుతి యునాన్ ప్రాంతంలో కూడా బలమైన ప్రకంపనలు సంభవించాయి. ఇక బ్యాంకాక్ చాటుచక్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న హైరైజ్ బిల్డింగ్ ఒకటి కూప్ప కూలింది. భూప్రకంపనల నేపథ్యంలో ఈ ప్రాంతంలో హోటల్స్ మూసి వేశారు. జనాలు భయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు. భూకంపానికి సంభందించిన భయంకర వీడియోలను జనాల్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. బ్యాంకాక్‌లో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
భారీ భూకంపం.. ఒక్కసారిగా రోడ్లపైకి జనాలు..