Hafeez Saeed: లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్‌కు చావు తప్పదు.. విశ్లేషకుల అంచనా
ABN , Publish Date - Mar 17 , 2025 | 10:25 PM
పాక్‌లో తలదాచుకుంటున్న 26/11 దాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ ఏదోక రోజు అతడి బంధువు అబూ కతల్ లాగే ప్రాణాలు కోల్పోతాడని పాక్ వ్యవహారాల నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: లష్కరే తయ్యబా ఉగ్రవాది అబూ కతల్ హత్య తరువాత ఉగ్ర సంస్థ చీఫ్, ముంబై 26/11 దాడుల ప్రధాన నిందితుడు హఫీజ్ సయీద్‌కు ఇదే గతి పడుతుందని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎల్ఈటీ కీలక నేతలపై నిఘా పెరిగిందని అబూ కతల్ హత్యతో రుజువైందని వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘హఫీజ్ సన్నిహితుడు, మేనల్లుడు అయిన అబూ కతల్ దారుణ హత్యకు గురయ్యాడు.. అంటే ఉగ్రవాదులను ట్రాక్ చేస్తున్న వారు తమ లక్ష్యానికి చేరువలో ఉన్నారని అర్థం. కత్తి పట్టుకుని తిరిగే వాడు చివరకు అదే కత్తికి బలవుతాడు. అబూ కతల్‌కు పట్టిన గతే హఫీజ్‌కూ పడుతుంది’’ అని పాక్ వ్యవహారాల పరిశీలకులు అనేక మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. అబూ కతల్ హత్య తరువాత పాక్ మిలిటరీ హఫీజ్ భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.
Also Read: ఆస్ట్రేలియాలో భారీ అగ్నిప్రమాదం.. హోటల్ గదిలో మంటలు చెలరేగడంతో..
‘‘హఫీజ్‌కు ఇప్పటికే పాక్ వెన్నుదన్నుగా ఉంది. ఈ విషయంలో మరింత శ్రద్ధ పెట్టాలని మిలిటరీని అతడు కోరచ్చు. అసలు అబు కతల్ హత్య వెనకాల ఎవరున్నారనేది చెప్పడం కష్టం. ఇండియాపై నెపం మోపేందుకు పాక్ అధికారులే ఈ పని చేసుండొచ్చు’’ అని నిపుణులు భావిస్తున్నారు. ఇక అబు కతల్ హత్య ఘటనలో గాయపడ్డ వ్యక్తి స్వయంగా హఫీజ అయి ఉండొచ్చన్న వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి.
‘‘ఈ ఘటనలో గాయపడ్డ వ్యక్తి ప్రస్తుతం పాక్ మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయంలో పాక్ అత్యంత గోప్యంగా ఉంది. గాయపడ్డ వ్యక్తి గుర్తింపు వివరాలేవీ బయటకు పొక్కనియ్యడం లేదు. ఆ వ్యక్తి హఫీజే అయి ఉండొచ్చని కూడా కొందరు భావిస్తున్నారు’’ అని విశ్లేషకులు తెలిపారు.
Also Read: ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలపై ఈ వారమే ట్రంప్ పుతిన్ చర్చ..
‘‘గాయపడ్డ వ్యక్తి హఫీజా కాదా అన్నది అప్రస్తుతం. అతడికి కంటిమీద కునుకు కరువైందనేది మాత్రం స్పష్టం. అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇతరులకు టార్గెట్ లిస్టులో ఉన్నాడు. ఉగ్రవాదులకు పాక్ ఇంత ఎంతమాత్రమూ భద్రత కల్పించలేదన ఈ ఘటన స్పష్టం చేసింది. ఎటువంటి భద్రత కల్పించినా ఉగ్రవాదులకు చావు తప్పదన్న సందేశం ఈ ఘటన పంపించింది’’ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
2023లో రాజోరీలో జరిగిన ఉగ్రదాడులకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ అబూ కతల్‌పై చార్జ్ షీట్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఆదివారం మాంగ్లా ఝెలం రోడ్డులో అతడు ప్రయాణిస్తున్న వాహనంపై కాల్పులు జరగడంతో అతడు మృతి చెందాడు. అతడి బాడీ గార్డు కూడా ఈ ఘటనలో కన్నుమూశాడు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి