Share News

Iran America Nuclear Talks: అణు చర్చలపై ఇరాన్‌-అమెరికా ముందడుగు

ABN , Publish Date - Apr 13 , 2025 | 04:07 AM

ఇరాన్‌-అమెరికా అణు చర్చలపై ఒమన్‌ వేదికగా మొదటి పరోక్ష చర్చలు జరిగాయి. రెండు దేశాలు ఏప్రిల్‌ 19న మళ్లీ చర్చలకు నిర్ణయం తీసుకున్నాయి

Iran America Nuclear Talks: అణు చర్చలపై ఇరాన్‌-అమెరికా ముందడుగు

  • ఒమన్‌ వేదికగా రెండు దేశాల ప్రతినిధుల పరోక్ష చర్చలు

  • ఏప్రిల్‌ 19న మళ్లీ చర్చలకు నిర్ణయం

మస్కట్‌, ఏప్రిల్‌ 12: అణు ఒప్పందానికి సంబంధించిన చర్చలపై ఎట్టకేలకు ఇరాన్‌-అమెరికా ముందడుగు వేశాయి. ఒమన్‌ వేదికగా పరోక్ష చర్చలు జరిపాయి. ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరఘ్చి, అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్‌ విట్కాఫ్‌ మస్కట్‌లో ఒమన్‌ విదేశాంగ మంత్రి బదర్‌ అల్‌ బుసైదితో వేర్వేరుగా సమావేశమయ్యారు. రెండున్నర గంటలకు పైగా చర్చలు సాగాయి. చర్చలు ముగిశాక రెండు పక్షాల ప్రతినిధులు కాసేపు ముఖాముఖి మాట్లాడుకున్నారు. సుహృద్భావక వాతావరణంలో నిర్మాణాత్మక చర్చలు జరిగాయని సమావేశానంతరం ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ తెలిపారు. ఏప్రిల్‌ 19న మరోసారి చర్చలు కొనసాగించాలని రెండు పక్షాలు నిర్ణయించాయన్నారు. తొలివిడత చర్చలపై సమీక్ష జరుపుతామని, తమ దేశం న్యాయమైన ఒప్పందంకుదుర్చుకోవాలని చూస్తోందని అబ్బాస్‌ స్పష్టం చేశారు. మరోవైపు చర్చల్లో ఏమీ తేలకపోతే సైనిక చర్య తప్పదని, మునుపెన్నడూ చూడని రీతిలో బాంబుదాడులు చేస్తామని ట్రంప్‌ ఇప్పటికే హెచ్చరించారు. అణు కార్యక్రమంపై ఇరాన్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకెళ్లరాదని అమెరికా పట్టుబడుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Minister Kollu Ravindra: కులాలు, మతాల మధ్య చిచ్చుపెడితే.. మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్..

South Central Railway: గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే.. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లు..

Updated Date - Apr 13 , 2025 | 04:07 AM