Terrorist Arrest USA: ఖలీస్థానీ ఉగ్రవాది అమెరికాలో అరెస్ట్
ABN , Publish Date - Apr 19 , 2025 | 03:18 AM
ఖలీస్థానీ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ హాపీ ఫాసియా అమెరికాలో ఎఫ్‌బీఐ చేతికి చిక్కాడు. ఇటీవల పంజాబ్‌లో జరిగిన గ్రెనేడ్ దాడుల్లో కూడా అతడి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి
న్యూయార్క్, ఏప్రిల్ 18: ఉగ్రవాదులతో సంబంధాలు కలిగిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ హాపీ ఫాసియా అమెరికాలో పట్టుబడ్డాడు. ఐఎ్‌సఐ, బబ్బర్ ఖల్సా ఇంటర్‌నేషనల్ (బీకేఐ) వంటి రెండు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్‌ప్రీత్‌ను ఎఫ్‌బీఐ టీం అరెస్ట్ చేసింది. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాడని, పోలీసులకు దొరకకుండా బర్నర్ ఫోన్లను ఉపయోగించినట్టు ఎఫ్‌బీఐ వెల్లడించింది. పంజాబ్‌లో ఇటీవల జరిగిన 14 గ్రెనేడ్ దాడులతో అతనికి ప్రమేయం ఉన్నట్టు అధికారులు చెప్పారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నాడని ఎన్‌ఐఏ ఈ ఏడాది ప్రారంభంలో హర్‌ప్రీత్‌పై కేసు నమోదు చేసింది.