Pakistan Army: పాక్ ఆర్మీ చీఫ్‌పై తిరుగుబాటు
ABN , Publish Date - Mar 27 , 2025 | 05:22 AM
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై జవాన్లు, అధికారి స్థాయి వ్యక్తులు తిరుగుబాటు చేశారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, లేకపోతే తామే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రాజీనామా చేయాలని సైన్యం అల్టిమేటం
ఇస్లామాబాద్, మార్చి 26: తిరుగుబాట్లతో.. ప్రభుత్వాలనే మార్చిన చరిత్ర ఉన్న పాక్ ఆర్మీలో ఇప్పుడు వింత పరిస్థితి నెలకొంది. జవాన్ మొదలు, కెప్టెన్, మేజర్, కల్నల్ ర్యాంకు అధికారులు తమ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ‘‘ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ రాజీనామా చేయాల్సిందే’’ అంటూ అల్టిమేటం జారీచేశారు. ఆసిమ్ వైఫల్యాలను ఒక్కొక్కటిగా పేర్కొంటూ.. ఓ లేఖ రాశారు. ఆయన రాజీనామా చేయకుంటే.. తామే చర్యలకు ఉపక్రమించాల్సి వస్తుందని, సైన్యాన్ని నియంత్రణలోకి తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి:
Yogi Adityanath: యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
కొబ్బరి నీళ్ల కంటే.. మంచి నీళ్లు మేలు.. డాక్టరేంటి ఇలా అన్నాడు..