Share News

Earthquake Videos: దడపుట్టిన భూకంపం.. విజువల్స్ చూశారా..

ABN , Publish Date - Mar 28 , 2025 | 03:53 PM

Myanmar Earthquake Updates: మయన్మార్, బ్యాంకాక్, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, భారత్, చైనాలో భారీ భూప్రకంపనలు సంభవించాయి. ప్రధానంగా మయన్మార్, బ్యాంకాక్, థాయ్‌లాండ్‌లో భూమి ఎక్కువగా కంపించింది. భూకంపం తీవ్రతకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ విజువల్స్ చాలా భయానకంగా ఉన్నాయి.

Earthquake Videos: దడపుట్టిన భూకంపం.. విజువల్స్ చూశారా..
Myanmar Earthquake Visuals

Earthquake Updates: మయన్మార్ సహా బ్యాంకాక్, థాయ్‌లాండ్‌, బంగ్లాదేశ్, భారత్, చైనాలో భూప్రకంపనలు సంభవించాయి. మయన్మార్, థాయ్‌లాండ్, బ్యాంకాక్‌లో భూమి అధికంగా కంపించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. భూకంప తీవ్రత అధికంగా ఉండటంతో భారీ భవనాలు పేక మేడల్లా కుప్పకూలిపోయాయి. భూమి కంపించడంతో భయపడిపోయిన జనాలు.. ఇళ్ల నుంచి భవనాల నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రతకు సంబంధించిన సీసీటీవీ విజువల్స్, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పెద్ద పెద్ద భవనాలను చూస్తుండగానే నేలమట్టమైన దృశ్యాలు ఈ వీడియోల్లో చూడొచ్చు. భూప్రకంపనల తీవ్రతకు ఓ బిల్డింగ్ పైన నిర్మించిన స్వి్మ్మింగ్ పూల్ నుంచి నీళ్లు కింద పడటం, ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు భయంతో నేలపై పడుకోవడం, రన్నింగ్‌లో ఉన్న వాహనాలు ఒక్కసారిగ పక్కకు వెళ్లడం ఈ విజువల్స్ క్లియర్‌గా చూడొచ్చు.


ఈ వీడియోలో భవనాలు పేకమేడల్లా కూలిపోవడం గమనించవచ్చు. కూలిపోయిన భవనాల శిథిలాల్లో చిక్కుకున్న ప్రజలను అక్కడి రెస్క్యూటీమ్స్ రక్షిస్తున్నాయి.


3 నిమిషాలపాటు సంభవించిన భూప్రకంపనల ధాటికి భారీ భవనం చిగురుటాకులా ఊగిపోయింది. దీంతో భవనం పైన నిర్మించిన స్విమ్మింగ్‌పూల్‌లోని వాటర్ కింద పడిపోయింది. ఈ విజువల్ చాలా భయానకంగా ఉంది.


కళ్ల ముందే కుప్పకూలిపోతున్న భవనాలు.. భయంతో ఆర్తనాదాలు చేస్తున్న జనాలు..


చైనాలో భూకంప తీవ్రతకు సంబంధించిన విజువల్స్..


వణికిపోయిన బ్యాంకాక్..


మయన్మార్‌లో భూకంపం సమయంలో రోడ్డుపై ఊగిపోతున్న వాహనాలు.. భయాందోళనలో ఆర్తనాదాలు చేస్తున్న జనాలు..

Updated Date - Mar 28 , 2025 | 03:54 PM