Share News

Trump Voter ID Directive: భారత్‌ను స్ఫూర్తిగా తీసుకుందాం

ABN , Publish Date - Mar 27 , 2025 | 04:55 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

Trump Voter ID Directive: భారత్‌ను స్ఫూర్తిగా తీసుకుందాం

  • ఇకపై ఓటరు నమోదుకు పౌరసత్వ రుజువు తప్పనిసరి .. ట్రంప్‌ ఉత్తర్వులు

వాషింగ్టన్‌, మార్చి 26: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ ఎన్నికల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా మంగళవారం ఆయన కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఎన్నికల నిర్వహణ విషయంలో అమెరికన్లు భారత్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని అందులో ట్రంప్‌ సూచించారు. భారత్‌, బ్రెజిల్‌ దేశాలు ఓటరు గుర్తింపును బయోమెట్రిక్‌ డేటాబే్‌సతో అనుసంధానం చేశాయని, అమెరికా మాత్రం పౌరసత్వం కోసం స్వీయ ధ్రువీకరణపై ఆధారపడుతూ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేందుకు అవసరమైన ప్రాథమిక రక్షణలు అమలు చేయడంలో విఫలమైందని ట్రంప్‌ తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ఓటరుగా నమోదు చేసుకోవడానికి, ఓటు వేయడానికి పౌరసత్వానికి సంబంధించిన ధ్రువపత్రాన్ని రుజువుగా చూపించడాన్ని తప్పనిసరి చేస్తున్నట్లు ఆ ఉత్తర్వులో స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపులో పేపర్‌ బ్యాలెట్ల విధానాన్ని పాటిస్తున్న జర్మనీ, కెనడా వంటి దేశాలను ఉదాహరణగా చూపిస్తూ, అమెరికా మాత్రం ఎలాంటి రక్షణలు లేని పద్ధతులపై ఆధారపడుతోందన్నారు.


ఎన్నికల తర్వాత రోజు వచ్చిన బ్యాలెట్లను లెక్కించకుండా రాష్ట్రాలను అడ్డుకోవడంలో దేశం విఫలమైందని, అమెరికా పౌరులు కానివారు కూడా ఓటు నమోదు చేసుకోవడానికి అనుమతించిందన్నారు. భారత్‌లో బయోమెట్రిక్‌ డేటాబేస్‌ గురించి ట్రంప్‌ ప్రస్తావించిన నేపథ్యంలో దేశంలో ఆధార్‌ కార్డును ప్రవేశపెట్టినందుకు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు కాంగ్రెస్‌ పార్టీ కృతజ్ఞతలు తెలిపింది. ట్రంప్‌ వ్యాఖ్యలు మన్మోహన్‌ దార్శనిక నాయకత్వానికి దక్కిన ప్రశంసలుగా అభివర్ణించింది.


ఇవి కూడా చదవండి:

చిత్రం భళారే విచిత్రం

Yogi Adityanath: యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

కొబ్బరి నీళ్ల కంటే.. మంచి నీళ్లు మేలు.. డాక్టరేంటి ఇలా అన్నాడు..

Updated Date - Mar 27 , 2025 | 04:55 AM