White House: వైట్‌హౌస్ సమీపంలో అగంతకుడు.. అధికారుల కాల్పులు
ABN , Publish Date - Mar 09 , 2025 | 09:44 PM
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ సమీపంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఒక అనుమానిత వ్యక్తిపై అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు. ఆదివారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ (White House) సమీపంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఒక అనుమానిత వ్యక్తిపై అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు. ఆదివారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలో ఉన్నారు.
Donald Trump: మనం తగ్గొద్దు!’
అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం, ఇండియానా నుంచి వాషింగ్టన్‌కు వస్తున్న ఒక వ్యక్తి కదలికలను స్థానిక పోలీసులు గమనించి వెంటనే వైట్‌హౌస్ సమీపంలోని సీక్రెట్ సర్వీసుకు సమాచారం అందించారు. దీంతో రంగంలోనికి దిగిన అధికారులు వైట్‌హౌస్‌కు సమీపంలో ఒక వాహనం పార్క్ చేసి ఉండటాన్ని గమనించారు. ఆ సమీపంలో ఒక వ్యక్తి సంచరిస్తుండటాన్ని గుర్తించి అతన్ని నిలువరించేందుకు ప్రయత్నం చేశారు. దీంతో ఆ వ్యక్తి తన వద్దనున్న తుపాకీని బయటకు తీశారు. ఈ సందర్భంగా వారి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అతనిపై సిబ్బంది కాల్పులు జరిపారు. కాగా, ఈ కాల్పుల్లో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి ఎలా ఉందనేది అధికారులు వెల్లడించలేదు.
ఇవి కూాడా చదవండి
Trump Key announcement: ఇక వ్యోమగాములు వచ్చేస్తారా.. ట్రంప్ సందేశం ఇదే
Marco Rubio Elon Musk showdown: అమెరికా విదేశాంగ శాఖ మంత్రితో మస్క్ రచ్చ.. చివర్లో ట్రంప్ ట్విస్ట్
Read Latest and International News