Share News

Donald Trumph: ట్రంప్ కొరడా.. 5 లక్షల మంది వలసదారులకు తాత్కాలిక నివాస హోదా రద్దు

ABN , Publish Date - Mar 22 , 2025 | 08:58 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తాత్కాలిక వలసదారులపై చర్యలకు దిగారు. దేశంలోని 5 లక్షల మందికి పైగా వలసదారుల తాత్కాలిక నివాస హోదాను రద్దు చేస్తున్నట్టు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాంట్ సెక్యూరిటీ తాజాగా ప్రకటించింది.

Donald Trumph: ట్రంప్ కొరడా.. 5 లక్షల మంది వలసదారులకు తాత్కాలిక నివాస హోదా రద్దు

మియామి: అక్రమ వలసదారులపై కొరడా ఝలిపిస్తు్న్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trumph) తాజాగా తాత్కాలిక వలసదారులపై చర్యలకు దిగారు. దేశంలోని 5 లక్షల మందికి పైగా వలసదారుల తాత్కాలిక నివాస హోదా (Temporary status for immigrants)ను రద్దు చేస్తున్నట్టు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాంట్ సెక్యూరిటీ తాజాగా ప్రకటించింది. వీరిలో క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనెజులా దేశాలకు చెందిన వారున్నారు. వీరికున్న చట్టపరమైన రక్షణ రద్దు చేయడంతో నెలరోజుల్లో వీరిని దేశం నుంచి బహిష్కరించనున్నట్టు హోమ్‌లాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోమ్ తెలిపారు. 2022 అక్టోబర్ తర్వాత ఈ నాలుగు దేశాల నుంచి అమెరికాకు వలస వచ్చిన సుమారు 5,32,000 మందికి ఈ ఉత్తర్వులు వర్తించనున్నట్టు చెప్పారు.

Trump Decision: అమెరికా విద్యాశాఖ మూసివేత!


మానవతా పెరోల్ కార్యక్రమం కింద అమెరికా వచ్చిన వీరంతా రెండేళ్ల పాటు యూఎస్‌లో ఉండటానికి తాత్కాలిక అనుమతులు పొందారని క్రిస్టీ నోమ్ వివరించారు. ఏప్రిల్ 24న ఫెడరల్ రిజిస్టర్‌లో నోటీసులు ప్రచురించిన 30 రోజుల తర్వాత వీరంతా అగ్రరాజ్యంలో ఉండేందుకు లీగల్ హోదా కోల్పోతారని చెప్పారు.


యుద్ధం, రాజకీయ అస్థిరత ఉన్న దేశాల ప్రజలు అమెరికాలో తాత్కాలికంగా నివాసం ఉండేందుకు వీలుగా మానవతా పెరోల్ అనేది సుదీర్ఘకాలంగా అమెరికాలో ఉంది. అయితే మానవతా పెరోల్ దుర్వినియోగం అవుతున్నందున దానికి స్వస్తి పలుకుతామని ట్రంప్ గత ఏడాది ఎన్నికల ప్రచారంలో కూడా ప్రస్తావించారు. మానవతా పెరోల్ కింద వచ్చే వారు మరింత కాసం ఉండేదుకు దరఖాస్తు చేసుకునే సౌలభ్యం గతంలో ఉన్నప్పటికీ ట్రంప్ ఈ దరఖాస్తుల ప్రక్రియను నిలిపివేశారు. ఫెడరల్ కోర్టులో దీనిని సవాలు చేస్తూ పిటిషన్లు సైతం దాఖలయ్యాయి. కాగా, వలసదారుల తాత్కాలిక నివాస హోదాను రద్దు చేస్తూ ట్రంప్ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయం దారుణమైనదని జస్టిస్ యాక్షన్ సెంటర్ డైరెక్టర్ కరెన్ టుమ్లిన్ వ్యాఖ్యానించారు.


Earth Hour 2025: ఈరోజు ఎర్త్ అవర్..ఈ టైంలో కరెంట్ బంద్ చేసి, ప్రకృతికి సహకరిద్దాం..

WWE: జాన్ సెనా వర్సెస్ ర్యాండీ ఆర్టన్.. ఇద్దరిలో ఎవరు రిచ్..

Read Latest and International News

Updated Date - Mar 22 , 2025 | 09:02 PM