Share News

US Tariffs: భారత్‌పై సుంకాల విధింపు.. అమెరికా కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 27 , 2025 | 11:16 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెర తీశాడు. దీనిలో భాగంగా విదేశి దిగుమతులపై ఎడాపెడా సుంకాల విధింపు చేపడుతున్నాడు. ఈ ప్రభావం భారత్ మీద కూడా ఉండనుంది. ఈ క్రమంలో ఇండియాపై సుంకాల విధింపు అంశంపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. చైనా, మెక్సికోల మాదిరి భారత్‌తో వ్యవహరించమని స్పష్టం చేసింది.

US Tariffs: భారత్‌పై సుంకాల విధింపు.. అమెరికా కీలక వ్యాఖ్యలు
Donald Trump

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ పాలన విషయాల్లో దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. అక్రమ వసలదారుల అంశంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. అలానే సుంకాలపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ప్రకటించిన పరస్పర సుంకాలు ఏప్రిల్ 2 తర్వాత నుంచి అమల్లోకి రానున్నాయి.

ఈ నేపథ్యంలో భారత్-అమెరికా మధ్య జరిగిన ద్వైపక్షిక వాణిజ్య ఒప్పందాలపై చర్చించేందుకు ఇరు దేశాల ప్రతినిధులు బుధవారం నాడు ఢిల్లీ వేదికగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అమెరికా వాణజ్య అధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. సుంకాల విధింపు అంశంలో.. ఇండియాతో చైనా, మెక్సికో, కెనడాల మాదిరి ఉండబోమని స్పష్టం చేశారు.


ఈ ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ట్రంప్.. చైనాతో పాటుగా కొత్తగా కెనడా, మెక్సికోలతో కూడా తొలిసారి వాణిజ్య యుద్ధానికి తెర తీశారు. భారత్-అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందాలపై చర్చించేందుకు వాషింగ్టన్ వాణిజ్య అధికారి బ్రెండన్ లించ్ తన బృందంతో కలిసి ఇండియా వచ్చాడు. నేడు (బుధవారం) నాడు అమెరికా వాణిజయ ప్రతినిధుల బృందం.. ఢిల్లీ అధికారులతో చర్చలు ప్రారంభించారు. శుక్రవారం నాటికి ఈ చర్చలు ముగిసి.. ఇరుదేశాల మధ్య వాణజ్యపరమైన అంశాలపై ఓ నిర్ణయానికి రానున్నాయి.

ఈ సందర్భంగా అమెరికా వాణిజ్య బృందం అధికారి ఒకరు మాట్లాడుతూ.. "ట్రంప్ పరిపానలో.. చైనా, మెక్సికో, కెనడా దేశాలతో సమానంగ భారత్‌ను చూడటం లేదు. చైనా, మెక్సికో, కెనడా దేశాలతో అమెరికాకు అనేక సమస్యలు ఉన్నాయి. కరెన్సీ అవకతవకలు, అక్రమవలసలు, ఇతర భద్రతా సమస్యలు ఉన్నాయి. కానీ ఇండియాతో మాత్రం కేవలం సుంకాల సమస్య మాత్రమే ఉంది. దీనిపై రెండు దేశాలు స్నేహపూర్వకంగా చర్చించుకుని పరిష్కరించుకోనున్నాయి. రెండు దేశాలకు సంతృప్తికరమైన ఫలితం వస్తుందని భావిస్తున్నాం"అన్నారు.


ఈ వాణిజ్య ఒప్పందాలపై చర్చించేందుకు గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ వచ్చే నెల అనగా ఏప్రిల్‌లో.. వాషింగ్టన్‌లో పర్యటించనున్నారు. దీనిపై ఓ వైట్‌హౌస్ అధికారి మాట్లాడుతూ.. "భారత ఆర్థిక మంత్రి అమెరికా పర్యటనలో కేవలం వాణిజ్యం, సుంకాల గురించి మాత్రమే కాకుండా ఇరు దేశాల మధ్య బలమైన వాణిజ్య బంధం ఏర్పర్చుకునే దిశగా ఇరు దేశాలు ముందుకు వెళ్లనున్నాయి" అని తెలిపాడు.

ట్రంప్ అధికారంలోకి రాగానే.. చైనా దిగుమతులపై 10 శాతం టారిఫ్ విధించాడు. మార్చి 4 నాటికి దాన్ని 20 శాతానికి పెంచాడు. అలానే మెక్సిక, కెనడా నుంచి దిగుమతి చేసుకునే పదార్థాలపై ఏకంగా 25 శాతం టారిఫ్ విధించాడు. ఇండియా కూడా అధిక సుంకాలు విధిస్తుందని.. ఈ అంశంలో తాము కూడా అలానే ఉంటామని ట్రంప్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే

ఇవి కూడా చదవండి:

454 చెట్లను నరికించిన వ్యక్తికి 4.54 కోట్ల ఫైన్‌

భారత్‌ను స్ఫూర్తిగా తీసుకుందాం

Updated Date - Mar 27 , 2025 | 11:23 AM