Share News

116 ఏళ్ల బామ్మ మృతి

ABN , Publish Date - Jan 05 , 2025 | 02:33 AM

ఈ ఫొటోలో కనిపిస్తున్న బామ్మ పేరు టొమికో ఇటూకా. జపాన్‌కు చెందిన ఈమె ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా పేరుగాంచారు.

116 ఏళ్ల బామ్మ మృతి

ప్రపంచంలో అత్యంత వృద్ధురాలిగా గుర్తింపు

ఈ ఫొటోలో కనిపిస్తున్న బామ్మ పేరు టొమికో ఇటూకా. జపాన్‌కు చెందిన ఈమె ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా పేరుగాంచారు. 116 ఏళ్ల వయసున్న ఈమె డిసెంబరు 29న కన్నుమూసినట్టు శనివారం ప్రకటించారు. 1908 మే 23న ఈమె.. అషియా సిటీకి సమీపంలోని ఒసాకాలో జన్మించారు. గత ఏడాది ఆగస్టులో 117 ఏళ్ల స్పెయిన్‌ దేశస్థురాలు బ్రన్యాస్‌ మొరేరా మృతి చెందడంతో ఇటూకాను ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళగా గుర్తించారు. ఇదిలా ఉండగా.. సెప్టెంబరు నాటికి జపాన్‌లో వందేళ్లు అంతకన్నా ఎక్కువ వయసున్న వారి సంఖ్య 95వేలకు పైగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో 88 శాతం మంది మహిళలేనట.

Updated Date - Jan 05 , 2025 | 02:33 AM