Share News

Parenting Tips: పిల్లలకు 'నో' అని తెగేసి చెప్తున్నారా..బీ కేర్‌ఫుల్.. ఈ విషయం గనక చెప్పకపోతే..

ABN , Publish Date - Mar 29 , 2025 | 02:41 PM

Parenting Tips: పిల్లలు కొన్ని విషయాల్లో నాకిది కావాల్సిందే అని మొండికేస్తుంటారు. ఏడిపించి లేదా బెదిరించి అయినా కావాల్సింది దక్కించుకోవాలని భీష్మించుకుని కూర్చుంటారు. ఇలాంటప్పుడు చాలామంది పేరెంట్స్ తమ పిల్లల మనోభావాలను పట్టించుకోకుండా కచ్చితంగా వద్దంటే వద్దని తెగేసి చెప్తుంటారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు ఈ విధంగా ప్రవర్తిస్తే చాలా డేంజర్ అంటున్నారు సైకాలజిస్టులు.

Parenting Tips: పిల్లలకు 'నో' అని తెగేసి చెప్తున్నారా..బీ కేర్‌ఫుల్.. ఈ విషయం గనక చెప్పకపోతే..
Parenting without conflict

Parenting Tips: పిల్లలకు తమతో పాటు బయటకు తీసుకెళ్లాలంటేనే చాలా మందికి పేరెంట్స్‌కు భయం. ఏం కావాలని అడుగుతారో.. కొనివ్వకపోతే ఏమని గోల చేస్తారో.. ఎలా సర్దిచెప్పాలో అని ఆందోళన పడుతుంటారు. మరికొందరమో నేను ఒక్కసారి వద్దని గట్టిగా అరిస్తే మా పిల్లల మరో మాట మాట్లాడకుండా చెప్పినట్లు వింటారని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. మొండిచేసే పిల్లలను భయపెట్టడాన్నే సముదాయించడం అని భావిస్తుంటారు. పిల్లలు ఏదైనా కావాల్సిందే అని గట్టిగా అడిగినప్పుడు పేరెంట్స్ కంగారుపడిపోవడం లేదా భయపెట్టడం రెండూ సరైన పద్ధతులు కాదంటున్నారు మానసిక నిపుణులు. వారికి ఏ విషయంలో అయినా నో చెప్పేటప్పుడు కచ్చితంగా అందుకు గల కారణాన్ని కూడా చెప్పి తీరాల్సిందే అని సూచిస్తున్నారు. ఇలా చెప్పకపోతే ఏమవుతుందంటే..


'నో' ఒక్కటే సరిపోదు..

పేరెంట్స్ బయటకు వెళ్లిన ప్రతిసారీ తమను వెంట తీసుకెళ్లమని పిల్లలు మారాం చేయడం సహజం. ఇలాంటి సందర్భాల్లోనే వారు నచ్చింది కొనివ్వాలని పట్టుబడుతుంటారు. లేకపోతే ఇంట్లో ఏవైనా ఆహారపదార్థాలు కనిపిస్తే ఒకేసారి మొత్తం తినేస్తుంటారు. అలాంటప్పుడు పెద్దలు గనక వద్దని చెప్తే నీకర్థం కాదా అని పిల్లలపై కోపంగా అరిస్తే అప్పటికి సైలెంట్ అయినా.. ఆ మాటల ప్రభావం మనసులోంచి చెరిగిపోదని సైకాలజిస్టులు చెప్తుతున్నారు. ఎందుకు అడిగినవన్నీ కొనివ్వలేకపోతున్నారో.. చెడు ప్రవర్తనను మార్చుకోకపోతే భవిష్యత్తులో ఏ ఇబ్బందులు ఎదురవుతాయో వారికి అర్థమయ్యేలా నెమ్మదిగా నచ్చజెప్పాలని సూచిస్తున్నారు. అలాకాకుండా, క్రమశిక్షణ పేరిట పిల్లల పట్ల కఠినంగా ప్రవర్తిస్తే వారిలో తిరుగుబాటు తరహా ప్రవర్తన, పేరెంట్స్ తీరుపై అసంతృప్తి, కోపం పెంచుకునే అవకాశం ఉంది.

calmdown.jpg


పిల్లలకేం తెలుసు అనుకోకండి..

పెద్దలు చేసే ప్రతి పనిని పిల్లలు నిత్యం క్షుణ్ణంగా పరిశీలిస్తూ అనుకరించేందుకు ప్రయత్నిస్తుంటారు. తల్లిదండ్రుల అలవాట్లు, ప్రవర్తన, వారి ఆలోచనలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అందుకే పేరెంట్స్ ఎప్పుడూ పిల్లల ముందు ఏ విషయమైనా చర్చించుకునేటప్పుడు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. వారితో కమ్యూనికేట్ అయ్యేటప్పుడూ జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే, వారు మీ ఎమోషన్స్, ఎక్స్ ప్రెషన్స్ ప్రతిదీ గమనిస్తారు. అందుకే ఏదైనా కావాలని కోరినప్పుడు నిర్ధాక్షిణ్యంగా వద్దని చెప్పకుండా అందుకు రీజన్ ఏంటో కూడా చెప్తే మాకూ ఇంట్లో అన్ని విషయాల్లో ప్రాధాన్యత ఇస్తున్నారని గొప్పగా భావిస్తారు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పంచుకునేందుకు మా వంతు తోడ్పడాలని నిర్ణయించుకుంటారు. ఈ తరహా పేరెంటింగ్ పిల్లల్లో ప్రేమ, సానుకూల దృక్పథం, స్వతంత్రంగా ఆలోచించే తీరును మేల్కొలుపుతుది. సో.. పిల్లలకు చెప్పడం అనవసరం అని అనుకోకుండా.. పేరెంట్స్ నో చెప్పేటప్పుడు.. అలా ఎందుకు చెప్పాల్సి వస్తోందో కూడా చెప్పండి.


Read Also: Deep Fried Foods: డీప్ ఫ్రై ఫుడ్స్ అంటే ఇష్టమా.. ఇలా చేసుకుని తిన్నా ఏం కాదంట..

Coriander Leaves: కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే.. ఇలా చేయండి..

Buying Water Melon: పుచ్చకాయ కొంటున్నారా..తియ్యగా, జ్యూసీ

Updated Date - Mar 29 , 2025 | 02:53 PM