Share News

AR Rahman: ఏఆర్ రెహమాన్‌కు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..

ABN , Publish Date - Mar 16 , 2025 | 10:15 AM

సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తమిళ మీడియా పేర్కొంది. ఆయన ఛాతిలో విపరీతమైన నొప్పి రావటంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

AR Rahman: ఏఆర్ రెహమాన్‌కు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
AR Rahman

భారత దిగ్గజ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. తమిళ మీడియా కథనం ప్రకారం.. ఆదివారం ఉదయం ఆయనకు ఛాతిలో నొప్పిరావటంతో హుటాహుటిన చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. రెహమాన్ ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు. ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. డాక్టర్లు రెహమాన్‌కు యాంజియోగ్రామ్, ఈసీజీ వంటి టెస్టులు నిర్వహిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, ఆయన సంగీతం అందించిన తాజా చిత్రం చావా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. వందల కోట్ల రూపాయల కలెక్షన్లు కొల్లగొట్టింది. తెలుగులోనూ సంచలన విజయాన్ని అందుకుంది.


కొద్దిరోజుల క్రితమే విడాకులు..

రెహమాన్ కొన్ని నెలల క్రితమే భార్యతో విడిపోయారు. 29 ఏళ్ల బంధానికి స్వప్తి చెబుతూ విడాకులు తీసుకున్నారు. రెహమాన్ 1995లో సైరా బానును పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. రెహమాన్, సైరా బానుల విడాకులపై వారి అడ్వకేట్ వందనా షా మాట్లాడుతూ.. ‘ ఇద్దరి మధ్యా గాఢమైన ప్రేమ ఉన్నా.. చిన్న చిన్న విభేదాలు, గొడవలు వచ్చాయి. అవి వారి మధ్య అధిగమించలేని అగాధాన్ని సృష్టించాయి. సైరా చాలా బాధ, వేదనతో ఈ నిర్ణయం తీసుకున్నారు’ అని అన్నారు. ఇక, వారి పిల్లలు కూడా విడాకులపై స్పందించారు. తమ తల్లిదండ్రులు విడాకుల విషయంలో గోప్యత పాటించి, గౌరవంగా వ్యవహరించారని అన్నారు. రెహమాన్ అభిమానులకు ధన్యవాదాలు తెలియజేయశారు.


ఇవి చదవండి:

రాజధాని ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రికార్డు!

పెళ్లి వేళ పసిడి వెలవెల

తమిళం మధురమైన భాష... మన ఆస్తి కూడా

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 16 , 2025 | 10:47 AM