ATM services: ఇకపై రైళ్లలోనూ ఏటీఎం సేవలు
ABN , Publish Date - Apr 17 , 2025 | 04:30 AM
ముంబై-మన్మాడ్ మధ్య ప్రయాణించే పంచవటి ఎక్స్‌ప్రెస్లో ఏటీఎం సేవలు ప్రయోగాత్మకంగా ప్రారంభించబడ్డాయి. రైలు కదిలేపుడు కూడా ఈ సేవలను ప్రయాణికులు సౌకర్యంగా ఉపయోగించవచ్చని అధికారులు తెలిపారు.
ప్రయోగాత్మకంగా పంచవటీ ఎక్స్‌ప్రె్‌సలో అమలు
ముంబై, ఏప్రిల్ 16: ఏటీఎం సేవలు ఇకపై రైళ్లలోనూ అందుబాటులోకి రానున్నాయి. ప్రయోగాత్మకంగా ముంబై-మన్మాడ్ మధ్య ప్రయాణించే పంచవటి ఎక్స్‌ప్రె్‌సలో అమలు చేశారు. ఈ రైల్లోని ఓ ఏసీ కోచ్‌లో ఏర్పాటు చేసిన ఏటీఎం ట్రయల్ రన్ విజయవంతంగా ముగిసినట్లు అధికారులు తెలిపారు. దారి మధ్యలో టన్నెళ్లు, పరిమిత మొబైల్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యలు ఎదురైనప్పటికీ, ఏటీఎం సేవల విషయంలో ప్రయాణికులు సంతృప్తితో ఉన్నారని చెప్పారు. ఇండియన్ రైల్వేస్ ఇన్నోవేటివ్ నాన్ ఫేర్ రెవెన్యూ ఐడియాస్ స్కీంలో భాగంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సహకారంతో ఏటీఎం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రైలు కదులుతున్నప్పుడు కూడా ప్రయాణికులు ఈ ఏటీఎం సేవలను వినియోగించుకోవచ్చని వారు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...