MP salary hike: ఎంపీల వేతనాలు 24% పెంపు
ABN , Publish Date - Mar 25 , 2025 | 03:03 AM
కేంద్ర ప్రభుత్వం ఎంపీల వేతనాలను 24% మేర పెంచుతూ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనితో ఎంపీల నెలవారీ వేతనం రూ.1 లక్ష నుండి రూ.1.24 లక్షలకు, దినసరి భత్యం రూ.2,000 నుండి రూ.2,500లకు పెరిగింది. మాజీ ఎంపీల పెన్షన్ రూ.25,000 నుండి రూ.31,000కు పెంచబడింది.

రూ.లక్ష నుంచి రూ.1.24 లక్షలకు పెరిగిన నెల జీతం
రూ.25 వేల నుంచి 31 వేలకు చేరిన పెన్షన్
నోటిఫికేషన్ ఇచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ, మార్చి 24: పార్లమెంటు సభ్యుల వేతనాలను 24ు మేర పెంచుతూ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. భత్యాలు, పెన్షన్లను కూడా పెంచింది. ఈ నిర్ణయం 2023 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వర్తిస్తుందని పేర్కొంది. దీని ప్రకారం ఎంపీల నెలవారీ వేతనం రూ.లక్ష నుంచి రూ.1.24 లక్షలకు, దినసరి భత్యం రూ.2,000 నుంచి రూ.2,500లకు పెరిగింది. మాజీ ఎంపీలకు ప్రస్తుతం నెలకు రూ.25,000 పెన్షన్ వస్తుండగా దాన్ని రూ.31వేలకు పెంచింది. అయిదేళ్లు కన్నా ఎక్కువ కాలం పాటు ఎంపీగా పనిచేస్తే ప్రతి అదనపు సంవత్సరానికీ అఽధిక పెన్షన్ లభిస్తుంది. దానిని కూడా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పెంచింది. అలాంటివారికి ప్రస్తుతం నెలకు అదనంగా రూ.2,000 ఇస్తుండగా, ఇకపై రూ.2,500 ఇవ్వనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
YCP: భయం గుప్పెట్లో.. విశాఖ వైసీపీ
Mayor Suresh Babu: కడప గడ్డపై వైసీపీ షాక్
Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు
Cell Phones: పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..
T Congress Leaders: ఢిల్లీ చేరుకున్న కాంగ్రెస్ నేతలు.. కేబినెట్ కూర్పుపై కసరత్తు
For National News And Telugu News