Chidambaram: ట్రంప్ టారిఫ్ అలజడుల 'చిదంబర' రహస్యం?
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:38 PM
అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి ప్రపంచ దేశాల మధ్య బహుపాక్షిక, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయని, అలాంటప్పుడు ట్రంప్ టారిఫ్స్ యుద్ధంపై ఎందుకు చర్చించడంలేదని పి. చిదంబంరం ప్రశ్నించారు.

ట్రంప్ టారిఫ్ ల యుద్ధం ఇలాగే కొనసాగితే మరో మూడు నుంచి ఆరు నెలల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావం ఎదుర్కొంటుందని మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం(Chidambaram) హెచ్చరించారు. దాదాపు నెల రోజులుగా దీనిపై ట్రంప్ ఇష్టమొచ్చినట్టు ప్రకటనలు చేస్తుంటే భారత ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఒక నేషనల్ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం.. అమెరికా విధిస్తోన్న టారిఫ్ యుద్ధం పై సీరియస్ గా రియాక్టయ్యారు. అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి ప్రపంచ దేశాల మధ్య బహుపాక్షిక, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయని, అలాంటప్పుడు ఈ అంశంపై ఎందుకు చర్చించడంలేదని చిదంబంరం ప్రశ్నించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల (US Trade Tariffs)యుద్ధ బెదిరింపుకు భారతదేశం ప్రతిస్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంపై పార్లమెంటులో చర్చ లేదా ప్రతిపక్ష పార్టీలతో ఇంతవరకూ ఎందుకు కేంద్రం సంప్రదింపులు జరపలేదని ఆరోపించారు. ట్రంప్ ఎత్తుగడలను తిప్పికొట్టడానికి అవసరమైతే, ఇదే సమస్యని ఎదుర్కొంటోన్న ఇతర దేశాలతో ఉమ్మడి ఫ్లాట్ ఫాం తయారుచేసుకోవాలని చిదంబరం సూచించారు. అధ్యక్షుడు ట్రంప్ వ్యక్తిగతంగా వివిధ దేశాలను ఎంచుకుని వేర్వేరు సుంకాలను వర్తింపజేయడం ప్రారంభిస్తే, ప్రభావిత దేశాలు ఒంటరిగా పోరాడవలసి వస్తుందని హెచ్చరించారు.
ఒకేవేళ అమెరికా ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి వేస్తుందని భారత ప్రభుత్వం(Modi Government) భావిస్తే, దానిని ఎదుర్కోవడానికి ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లాలని చిదంబరం సూచించారు. ఇండియా స్టాండ్ ఏంటన్నది మొత్తం ప్రపంచానికి బహిరంగపరచాల్సిన అవసరం లేదని, కానీ కనీసం పార్లమెంటులో ఒక ప్రకటన చేయాలి లేదా ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపులైనా జరపాలికదా? అని మాజీ కేంద్రమంత్రి అన్నారు. ఈ అంశంలో మోదీ సర్కారు పూర్తిగా అంధకారంలో ఉందని ఆయన ఎద్దేవా చేశారు. అన్ని ఆటో దిగుమతులపై 25 శాతం సుంకం విధించాలనే ట్రంప్ నిర్ణయం భారతదేశం అమెరికాకు చేసే దాదాపు $7 బిలియన్ల ఎగుమతులపై అనిశ్చితిని కలిగించిందని చెప్పారు. భారతదేశ ఆటో కాంపోనెంట్ రంగం ఆదాయంలో ఐదవ వంతు ఎగుమతుల నుండి వస్తుందని.. ఇందులో 27 శాతం అమెరికా మార్కెట్ ఉందని చిదంబరం అన్నారు. ఇకనైనా భారత ప్రభుత్వం దీనిపై చర్యలకు ఉపక్రమించాలని చిదంబరం అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి...
Rice: సన్నబియ్యం వచ్చేశాయ్.. వచ్చే నెల నుంచే రేషన్‌షాపుల్లో పంపిణీ
Young Man Killed: పుట్టినరోజు నాడే కిరాతకం.. యువకుడి దారుణ హత్య
Read Latest Telangana News And Telugu News