National Herald case: రాజకీయ ప్రతీకారమే!
ABN , Publish Date - Apr 17 , 2025 | 04:38 AM
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పేర్లు చార్జిషీట్‌లో పేర్కొనడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా నిరసించింది. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వంపై నిరసన తెలపడంతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయబడింది.
ఈడీ చార్జిషీట్‌లో సోనియా, రాహుల్‌పేర్లపై భగ్గుమన్న కాంగ్రెస్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జిషీట్‌లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పేర్లను పేర్కొనడాన్ని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా నిరసించారు. ఏఐసీసీ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జెండాలను చేతబూని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది రాజకీయ ప్రతీకార చర్య అంటూ ధ్వజమెత్తారు. 24, అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ కేంద్ర కార్యాలయం వెలుపల కాంగ్రెస్ కార్యకర్తలు.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ‘‘కాంగ్రెస్ అగ్రనేతలు భయపడవద్దు.. మొత్తం దేశం మీతో ఉంది’’ అంటూ రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చిన నేపథ్యంలో భారీ స్థాయిలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి...