Share News

Delh High Court: భార్య ప్రియుడిపై కోర్టుకెక్కిన భర్త.. న్యాయం స్థానం తీర్పు ఏంటంటే..

ABN , Publish Date - Apr 18 , 2025 | 05:42 PM

భార్యను భర్త ఆస్తిగా చూసే భావనకు కాలం చెల్లిందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఓ వివాహిత ప్రియుడిపై ఆమె భర్త వేసి కేసు కొట్టేస్తూ ఈ తీర్పు వెలువరించింది.

Delh High Court: భార్య ప్రియుడిపై కోర్టుకెక్కిన భర్త.. న్యాయం స్థానం తీర్పు ఏంటంటే..
Delhi High Court

తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటూ ఓ వ్యక్తిపై కోర్టుకెక్కిన భర్త కేసులో ఢిల్లీ హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఈ కేసు నుంచి మహిళ ప్రియుడికి విముక్తి కల్పించింది. భార్యను భర్త ఆస్తిగా చూసే భావనకు కాలం చెల్లిందని పేర్కొంది. ఐపీసీ సెక్షన్ 497 రాజ్యాంగబద్ధం కాదన్న సుప్రీం కోర్టు తీర్పు కూడా ఈ సందర్భంగా పేర్కొంది. భర్త వేసిన కేసు కొట్టేస్తున్నట్టు పేర్కొంది.


వివాహేతర సంబంధం నైతికతకు సంబంధించిన అంశమని, దీన్ని క్రైమ్‌గా చూడజాలమని సుప్రీం కోర్టు పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించింది. ఆ సందర్భంగా మహాభారతంలో ద్రౌపది ఎదుర్కొన్న దురవస్థను కూడా హైకోర్టు పేర్కొంది. ఇలాంటి ఘటనలు, పురుషాధిక్య భావజాలానికి అద్దం పడతాయని వెల్లడించింది. సెక్షన్ 497 రాజ్యాంగ బద్ధం కాదన్న సుప్రీం తీర్పు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోందని న్యాయమూర్తి పేర్కొన్నారు. పెళ్లి పవిత్రతను పరిరక్షించడం కంటే భర్త హక్కులకే ప్రాధాన్యమిస్తున్నట్టున్న సెక్షణ్ 497కు కాలం చెల్లిందని పేర్కొంది.


కోర్టు వివరాల ప్రకారం, సదరు వ్యక్తి తన భార్య ప్రియుడిపై కేసు పెట్టాడు. తన అనుమతి లేకుండా తన భార్యను తీసుకుని అతడు మరో నగరానికి వెళ్లాడని ఆరోపించారు. వారిద్దరూ హోటల్‌లో శారీరకంగా దగ్గరయ్యారని అన్నాడు. ఈ కేసులో ప్రియుడికి మెజిస్టీరియల్ కోర్టులో ఊరట దక్కగా సెషన్స్ కోర్టు మాత్రం ఈ తీర్పును పక్కన పెట్టింది. తాజాగా హైకోర్టు సెషన్స్ కోర్టు తీర్పు పక్కన పెడుతూ మహిళ భర్త వేసిన కేసును కొట్టేసింది.

ఇవి కూడా చదవండి:

Chhattisgarh: లొంగిపోయిన 33 మంది నక్సల్స్

బెంగాల్ ఘటనలపై బంగ్లా అనుచిత వ్యాఖ్యలు.. ఖండించిన భారత్

ఎలాన్ మస్క్‌తో టెక్ సహకారంపై మాట్లాడిన ప్రధాని మోదీ

Read Latest and National News

Updated Date - Apr 18 , 2025 | 06:10 PM