Fighter Jet Breaks: ఒళ్లు గగుర్పొడిచే సీన్.. రెండు ముక్కలైన ఫైటర్ జెట్
ABN , Publish Date - Apr 03 , 2025 | 07:51 AM
వాయుసేన ఫైటర్ జెట్ ఒకటి కుప్పకూలి.. రెండు ముక్కలైంది. వెంటనే భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒక పైలెట్ మృతి చెందాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ప్రమాాదం వివరాలు..

గాంధీనగర్: నేటి కాలంలో ప్రమాదాలకు హద్దు లేకుండా పోతుంది. రోడ్ల మీద ప్రయాణించే వాహనాలు, మనుషులే యాక్సిడెంట్లకు గురువుతున్నారనుకుంటే.. ఆకాశంలో ఎగిరే విమానాలు కూడా ప్రమాదాలకు గురవుతున్నాయి. వందల అడుగుల ఎత్తు నుంచి విమానాలు నేల మీదకు కూలిపోతున్నాయి. తాజాగా ఈ కోవకు చెందిన ప్రమాదం ఒకటి వెలుగు చూసింది. ఫైటర్ జెట్ ఒకటి కుప్ప కూలిపోయింది. రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో ఒక పైలెట్ మృతి చెందాడు. ఒళ్లు గగుడర్పొడిచే ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ ప్రమాదం గుజరాత్, జామ్‌నగర్‌లో చోటు చేసుకుంది. వాయుసేన ఫైటర్ జెట్ ఒకటి బుధవారం రాత్రి కుప్ప కూలింది. ఈ ప్రమాంలో ఒక పైలెట్ మరణించగా.. మరొకరు మిస్ అయినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఐఏఎఫ్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. "జాగ్వర్ ఫైటర్ జెట్ కుప్పకూలింది. సాంకేతిక సమస్య కారణంగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇక పైలెట్ మృతి చెందారని తెలిపేందుకు చింతిస్తున్నాము. వారి కుటుంబానికి అండగా ఉంటారు. ప్రమాదానికి గల కారణాలు వెలికి తీయడం కోసం ఎంక్వైరీకి ఆదేశించాము" అని చెప్పుకొచ్చాడు.
జాగ్వర్ ఫైటర్ జెట్.. బుధవారం రాత్రి 9.50 గంటల ప్రాంతంలో జామ్ నగర్ ప్రాంతంలో కుప్పకూలింది. ప్రమాదాన్ని పసిగట్టిన ఓ పైలెట్ అప్రమత్తం అయి తప్పించుకోగా.. మరొకరు చనిపోయారు. ఫైటర్ జెట్ కింద కుప్పకూలి రెండు ముక్కలయ్యింది. వెంటనే దాని నుంచి మంటలు చెలరేగాయి. ఫైటర్ జెట్ కాక్‌పిట్, టెయిల్ భాగం రెండు వేర్వేరు ప్రాంతాల్లోపడి పోయి ఉన్నాయి. ప్రమాదానికి గురైన జాగ్వార్ ఫైట్ జెట్.. రెండు సీట్ల సాధారణ ట్రైనింగ్ జెట్ అని తెలిపారు.
ప్రమాదానికి గురైన ఫైటర్ జెట్ అంబాలా ఎయిర్ బేస్ నుంచి ప్రారంభం అయ్యిందని అధికారులు తెలిపారు. సాంకేతిక సమస్య గురించి అర్థం అయిన వెంటనే.. పైలెట్ అప్రమత్తం అయ్యి.. జెట్‌ని జనావాసాలకు దూరంగా తీసుకు వెళ్లారని.. అందుకే ఈ ప్రమాదంలో స్థానికులు ఎవరు గాయపడలేదని అధికారులు వెల్లడించారు. ఇక ప్రమాదం గురించి తెలిసిన వెంటనే వాయు సేన సిబ్బంది, స్థానిక పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి:
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టుకు భారత వాయుసేన గ్రీన్ సిగ్నల్