GP-Drashti: నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరే ‘ద్రష్టి’
ABN , Publish Date - Apr 06 , 2025 | 02:28 AM
అప్రమత్తంగా నిమిషాల్లోనే ఘటన స్థలానికి చేరుకునేందుకు గుజరాత్ పోలీసులు ‘జీపీ-ద్రష్టి’ అనే డ్రోన్ వ్యవస్థను ప్రారంభించారు. ఈ డ్రోన్లు సూరత్, అహ్మదాబాద్‌లలో ప్రయోగాత్మకంగా విజయవంతమవడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
గుజరాత్ పోలీసుల వినూత్న ప్రయోగం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: ప్రమాదం లేదా నేరాలు జరిగినప్పుడు నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకునేలా గుజరాత్ పోలీసులు ‘జీపీ- ద్రష్టి’ అనే పేరుతో డ్రోన్ ఆధారిత వ్యవస్థను రూపొందించారు. ఇది పీసీఆర్ (పోలీస్ కంట్రోల్ రూమ్) వాహనాలకు సహకారాన్ని అందిస్తుందని డీజీపీ వికాస్ సహాయ్ తెలిపారు. ప్రమాద స్థలానికి సరైన సమయంలో చేరుకుని, వారికి విచారణలో ఉపకరించే విధంగా ఈ వ్యవస్థను రూపొందించారు. ఘటన జరిగినప్పుడు ఈ డ్రోన్లు ప్రత్యక్ష పరిస్థితిని చిత్రీకరించి వాటిని పోలీసులకు చేరవేస్తాయి. పదిరోజుల పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మొదట సూరత్, అహ్మదాబాద్‌లో ప్రయోగించగా పీసీఆర్ వాహనాలతో పోలిస్తే సగం సమయంలోనే ఈ డ్రోన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయని డీజీపీ తెలిపారు. కొన్నిసార్లు కేవలం రెండు మూడు నిమిషాల వ్యవధిలోనే చేరుకున్నాయని వివరించారు. ఈ పైలెట్ ప్రాజెక్టు సక్సెస్ కావడంతో మరిన్ని డ్రోన్లను వినియోగించాలని అధికారులు నిర్ణయించారు.
ఇవి కూడా చదవండి..
Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్
NEET Row: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి
PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..
For National News And Telugu News