Jnanpith Award: వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞానపీఠ్
ABN , Publish Date - Mar 23 , 2025 | 04:09 AM
ఛత్తీ్‌సగఢ్ రాజధాని రాయపూర్‌లో నివాసం ఉన్న వినోద్ కుమార్ శుక్లా అనేక నవలలు, కథలు, కవితలు రాశారు. ‘దీవార్ మే ఏక్ ఖిడ్కీ థీ’ అనే నవల రాసినందుకు ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.

ఛత్తీ్‌సగఢ్ నుంచి ఈ పురస్కారానికి ఎంపికైన తొలి సాహితీ వేత్త
న్యూఢిల్లీ, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ఆధునిక హిందీ సాహిత్యంలో చెరగని స్థానం సంపాదించుకున్న సుప్రసిద్ద హిందీ సాహితీవేత్త, కవి వినోద్ కుమార్ శుక్లా (88) కు దేశంలోనే అత్యున్నత సాహితీ గౌరవంగా భావించే 2024-జ్ఞాన్‌పీఠ్ పురస్కారం లభించింది. ఛత్తీ్‌సగఢ్ రాజధాని రాయపూర్‌లో నివాసం ఉన్న వినోద్ కుమార్ శుక్లా అనేక నవలలు, కథలు, కవితలు రాశారు. ‘దీవార్ మే ఏక్ ఖిడ్కీ థీ’ అనే నవల రాసినందుకు ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ప్రముఖ ఒడియా రచయిత్రి ప్రతిభా రే అధ్యక్షతన శనివారం సమావేశమైన జ్యూరీ వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞానపీఠ్ పురస్కారం ఇవ్వాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ పురస్కారాన్ని అందుకున్న హిందీ రచయితల్లో వినోద్ కుమార్ శుక్లా 12వ వారు కాగా, ఛత్తీ్‌సగఢ్ నుంచి జ్ఞాన్‌పీఠ్ అవార్డు అందుకోనున్న తొలి రచయిత. ఈ ఏడాది జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీతను ఎంపిక చేసేందుకు ఏర్పాటైన జ్యూరీలో ప్రతిభా రేతోపాటు కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్, ప్రముఖ రచయితలు ప్రభావర్మ, దామోదర్ మోజో, అనామిక, ప్రఫుల్ షిలేదార్, జానకీ ప్రసాద్ వర్మలతో పాటు ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి- కవి ఏ కృష్ణారావు కూడా ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
Gmail: జీ మెయిల్ నుంచి కొత్త ఏఐ ఫీచర్..ఆ పనులు చేయడంలో కూడా హెల్పింగ్..
WhatsApp: దేశంలో కోటి వాట్సాప్ ఖాతాలు తొలగింపు..ఇలా చేస్తే మీ అకౌంట్ కూడా..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Read More Business News and Latest Telugu News