Indo Pakistan Marriage: ఆ జంట పెళ్లికి సరి‘హద్దు’ గీత
ABN , Publish Date - Apr 27 , 2025 | 01:30 AM
పహల్గాం ఉగ్రదాడి ప్రభావంతో రాజస్థాన్‌కు చెందిన వరుడు, పాకిస్థాన్‌కు చెందిన వధువు మధ్య జరగాల్సిన పెళ్లి నిలిపివేయబడింది. అటారీ సరిహద్దు మూసివేయడంతో వరుడు, అతని కుటుంబసభ్యులు పాక్ వెళ్లలేకపోయారు.
జైపూర్, ఏప్రిల్ 26: వధువు మెడలో వరుడు ఇక తాళి కడతాడనగా.. ‘ఆగండి.. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు’ అంటూ శాసించే కంఠాన్ని ఎన్ని సినిమాల్లో వినలేదు!? అచ్చంగా ఇలానే.. భారత్-పాక్‌కు చెందిన వధూవరుల పెళ్లి వేడుకను పెహల్గామ్ ఉగ్రదాడి ఘటన అనిశ్చితిలో పడేసింది. రాజస్థాన్‌లోని బర్మార్ జిల్లాకు చెందిన శైతాన్ సింగ్.. పాకిస్థాన్‌లోని అమర్‌కోట్ యువతి కేసర్ కన్వర్ పెళ్లి ఈనెల 30న వఽధువు ఇంట జరగాల్సి ఉంది. మేళతాళాలతో వరుడు, ఆయన కుటుంబసభ్యులు గురువారం పాక్‌లో అడుగుపెట్టేందుకు బరాత్‌తో అటారీ సరిహద్దుకు వెళ్లారు. అంతకుముందు రోజే కేంద్రం నుంచి ఆదేశాలు రావడంతో ఆ సరిహద్దును మూసివేశారు. వరుడి కుటుంబీకులు ప్రాధేయపడ్డా ఆవలివైపు వెళ్లేందుకు అధికారులు అనుమతివ్వలేదు.
ఇవి కూడా చదవండి:
పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.. అంతలోనే విషాదం..
Seema Haider: పాకిస్తాన్ తిరిగి వెళ్లటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీమా హైదర్