Rafale Jets: రూ.65వేల కోట్లతో త్వరలో 26 రఫేల్-మారిటైమ్ యుద్ధ విమనాలు
ABN , Publish Date - Apr 06 , 2025 | 02:41 AM
భారత నౌకాదళానికి 26 రఫేల్-మ్యారిటైమ్ యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్రం సుమారు రూ.65వేల కోట్ల విలువైన ఒప్పందానికి సిద్ధమైంది. భద్రతపై క్యాబినెట్ కమిటీ ఆమోదం కోసం ఈ నెలాఖరులో ఈ ప్రతిపాదన ముందుకు వెళ్లనున్నది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: భారత సైనిక దళాల సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 26 రఫేల్-మ్యారిటైమ్ యుద్ధ విమానాల కొనుగోలుకు తాజాగా సిద్ధమైంది. 7.6 బిలియన్ డాలర్ల(సుమారు రూ.65వేల కోట్లు) విలువైన ఈ ఒప్పందం కేంద్రం ఆమోదం కోసం ఈ నెలాఖరులో భద్రతపై క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) ముందుకు రానున్నట్లు సమాచారం. ఆ తర్వాత మూడు అదనపు డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గాముల కొనుగోలుకు కూడా ప్రభుత్వం పచ్చజెండా ఊపే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, మోదీ ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన 2014 నాటి నుంచి దాదాపు రూ.10 లక్షల కోట్ల విలువైన 1,096 రక్షణ ఒప్పందాలు చేసుకోవడం గమనార్హం.
ఇవి కూడా చదవండి..
Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్
NEET Row: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి
PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..
For National News And Telugu News