BBC warning: బీబీసీ వార్తాసంస్థకు కేంద్రం హెచ్చరిక
ABN , Publish Date - Apr 29 , 2025 | 05:14 AM
కశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రదాడి తరువాత బీబీసీ వార్తా సంస్థ పాకిస్థాన్ వివాదస్పద కథనం ప్రచురించడంతో కేంద్రం వారిని హెచ్చరించింది. అలాగే, పాకిస్థాన్‌కు చెందిన 16 యూట్యూబ్ చానళ్లను భారత్‌లో నిషేధించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: బీబీసీ వార్తా సంస్థను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ‘పాకిస్థాన్ సస్పెండ్స్ వీసాస్ ఫర్ ఇండియన్స్ ఆఫ్టర్ డెడ్లీ కశ్మీర్ అటాక్స్ ఆన్ టూరిస్ట్స్’ అంటూ ఆ సంస్థ పెట్టిన హెడ్డింగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ కథనంలోనే ఉగ్రవాదులను తీవ్రవాదులుగా పేర్కొనడమేంటని ప్రశ్నిస్తూ విదేశాంగ శాఖలోని ప్రచార విభాగం బీబీసీ భారత్ హెడ్ మార్టిన్‌కు ఒక లేఖ రాసింది. ఇకపై బీబీసీ ప్రసారాలను పర్యవేక్షిస్తుంటామని స్పష్టం చేసింది. కాగా, పాకిస్థాన్‌కు చెందిన 16 యూట్యూబ్ చానళ్లను మన దేశంలో నిషేధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత రెచ్చగొట్టే కథనాలను, మతపరంగా సున్నితమైన కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నందున ఈ చానళ్లపై నిషేధం విధించినట్లు ప్రభుత్వం తెలిపింది. హోం శాఖ సిఫారసు మేరకు డాన్, సామా టీవీ, బోల్ న్యూస్, రాఫ్తర్, జీయో న్యూస్, సునో న్యూస్ తదితర 16 యూట్యూబ్ చానళ్ల ప్రసారాలను భారత్‌లో నిషేధించారు.
ఇవి కూడా చదవండి..
PM Modi: ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 40 నిమిషాల భేటీ..ఏం చర్చించారంటే..
Pahalgam Terror Attack: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఉగ్ర దాడిపై స్పందించిన సీఎం
For National News And Telugu News