Justice Rastogi Statement: రాష్ట్రపతికి గడువు పెట్టి ఉండాల్సింది కాదు
ABN , Publish Date - Apr 19 , 2025 | 03:22 AM
రాష్ట్రపతికి బిల్లుల విషయంలో గడువు విధించడం రాజ్యాంగ విరుద్ధమని జస్టిస్ అజయ్ రస్తోగి పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతవేనని అన్నారు
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రస్తోగి వ్యాఖ్య
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: రాష్ట్రపతికి బిల్లుల విషయంలో గడువు విధించడం సరికాదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 రాష్ట్రపతిని ఆదేశించేందుకు సుప్రీంకోర్టుకు అధికారం ఇవ్వలేదని చెప్పారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్నారు. కాగగా.. సుప్రీంకోర్టుపై ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ చేసిన విమర్శలను సీనియర్ న్యాయవాది, ఎంపీ కపిల్ సిబల్ తప్పుపట్టారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్లు మంత్రి మండలి సలహా మేరకు విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. అలాకాకుండా బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా తనవద్దే పెట్టుకోవడం శాసనవ్యవస్థ అత్యున్నత అధికారాల్లోకి చొరబడటమేనన్నారు.