Khushbu Sundar: ఖుష్బూ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. హ్యాకర్ల వాట్సాప్ మెసేజ్ షేర్ చేసిన నటి
ABN , Publish Date - Apr 19 , 2025 | 10:52 PM
తన ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైనట్టు నటి ఖుష్బూ సుందర్ ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. హ్యాకర్లు తనకు వాట్సాప్ మేసేజీలు కూడా పంపించారని అన్నారు.
తన ఎక్స్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైందని నటి ఖుష్బూ సుందర్ తాజాగా పేర్కొన్నారు. ఇన్‌స్టాలో ఈ విషయాన్ని వెల్లడించారు. హ్యాకర్లు తనకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించారని కూడా తెలిపారు. ఇందుకు సంబంధించి స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేశారు.
హ్యాకింగ్‌కు గురి కావడంతో తన అకౌంట్‌లోకి లాగిన్ కాలేక పోతున్నట్టు ఖుష్బూ తెలిపారు. తన ఐడీ, పాస్‌వర్డ్ నిరుపయోగంగా మారాయని అన్నారు. గత 9 గంటలుగా తన అకౌంట్‌లో ఒక్క పోస్టు కూడా తాను పెట్టలేదని చెప్పుకొచ్చారు. సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని, అభిమానులు కొంచెం వేచి చూడాలని విజ్ఞప్తి చేశారు. తన ట్విట్టర్ పేజీలో ఏ పోస్టులు కనిపించినా వెంటనే తనకు తెలియజేయాలని కూడా విజ్ఞప్తి చేశారు.
హ్యాకర్ల నుంచి వచ్చిన వాట్సాప్ మేసేజీల స్క్రీన్ షాట్స్‌ను ఖుష్బూ శనివారం సాయంత్రం నెట్టింట పంచుకున్నారు. అకౌంట్‌ను తామే హ్యాక్ చేసినట్టు వారు తెలిపారని, కానీ తమకు ఈ అకౌంట్ నిరుపయోగమని అన్నారని ఆమె చెప్పారు. యూకేలో హ్యాకర్స్ దాక్కున్నట్టు కనిపిస్తోందని అన్నారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
కాగా, గతంలో ఇతర సినీ సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్స్ కూడా హ్యాకర్ల బారిన పడ్డయి. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాకర్ల బారిన పడ్డట్టు లక్ష్మీ మంచు ఇటీవల వెల్లడించారు. డబ్బులు కావాలంటూ తన అకౌంట్ నుంచి ఏవైనా సందేశాలు వస్తే నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. అంతకుమునుపు జావేద్ జాఫ్రీ అకౌంట్ కూడా హ్యాకర్ల పాల పడింది. త్రిష కృష్ణన్, తన్మయ్ భట్ వంటి వారు కూడా గతంలో హ్యాకింగ్ బారినపడ్డారు.
ఇవి కూడా చదవండి:
వచ్చే నెలలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ను భారతీయ గగనయాత్రికుడు శుభాంశూ శుక్లా..
బెంగాల్ ఘటనలపై బంగ్లా అనుచిత వ్యాఖ్యలు.. ఖండించిన భారత్
ఎలాన్ మస్క్‌తో టెక్ సహకారంపై మాట్లాడిన ప్రధాని మోదీ