Budget 2025: తాజా బడ్జెట్‌లో మాల్దీవులకు పెరిగిన కేటాయింపులు
ABN , Publish Date - Feb 01 , 2025 | 06:11 PM
మాల్దీవులతో దౌత్య సంబంధాల పునరుద్ధరణకు సూచనగా కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో ఆర్థికసాయాన్ని మునుపటితో పోలిస్తే భారీగా పెంచింది.

ఈసారి కేంద్ర బడ్జెట్‌లో భారత్ మాల్దీవులకు అందించే ఆర్థిక సాయాన్ని భారీగా పెంచింది. గతంలో పోలిస్తే ఈసారి మాల్దీవులకు అభివృద్ధి కోసం అందించే ఆర్థిక సాయాన్ని మోదీ ప్రభుత్వం ఏకంగా 28 శాతం మేర పెంచింది. గతేడాది ఇరు దేశాల మధ్య తీవ్ర దౌత్య ఉద్రిక్తతలు పొడచూపిన నేపథ్యంలో తాజా కేటాయింపులు ఆసక్తికరంగా మారాయి. ఉద్రికత్తల నడమ భారత్ అప్పట్లో మాల్దీవులకు అందించే నిధుల్లో కోత విధించింది. తదనంతరం, పరిస్థితులు సర్దుమణిగాయనేందుకు సూచనగా మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు మోదీ ప్రమాణస్వీకారానికి కూడా హాజరయ్యారు. దీనికి బలం చేకూర్చేలా భారత్ మార్లదీవులకు ఇచ్చే ఆర్థికసాయాన్ని మునుపెన్నడూ చూడని స్థాయిలో పెంచింది (Union Budget 2025) - Maldives).
Most Used Word by FM: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగంలో అత్యధిక సార్లు వినిపించిన పదం ఇదే!
బడ్జెట్ వివరాల ప్రకారం, ఈమారు మాల్దీవుల అభివృద్ధి కోసం ప్రభుత్వం 600 కోట్లు కేటాయించింది. ఇక గతేడాది మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రభుత్వం కేవలం 470 కోట్లే కేటాయించింది. ఇక ఎన్నికల నాటి మధ్యంతర బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.600 కోట్లు కేటాయించడం గమనార్హం.
ప్రధాని మోదీ లక్షద్వీప సందర్శన తరువాత మాల్దీవులు అవాకులు చవాకులు పేలిన విషయం తెలిసిందే. తమ పర్యాటకులను భారత్ తన వైపు ఆకర్షించే క్రమంలో తీసుకున్న చర్య మోదీ పర్యటన అని భావించిన మాల్దీవుల నాయకులు అనవసర వ్యాఖ్యలు చేసి దౌత్య వివాదాన్ని రేకెత్తించారు. ఆ తరువాత ఇండియా వ్యతిరేక ప్రచారంతో గద్దెనెక్కిన ముయిజ్జు క్రమంగా భారత్‌తో సఖ్యత పెంచుకున్నారు.
ఇక పొరుగు దేశాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన మోదీ ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో భూటాన్‌కు అత్యధికంగా రూ.2150 కోట్ల నిధులను కేటాయించింది. నేపాల్‌కు రూ.700 కోట్లు కేటాయించింది. ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్న మాల్దీవులకు రూ.600 కోట్లు, మారిషస్‌కు రూ.500 కోట్లు ప్రకటించారు.
Budget-2025: కేంద్ర ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల పూర్తి వివరాలు ఇవే..