Mamata Banerjee: అల్లర్ల వెనుక అమిత్ షా కుట్ర: మమత
ABN , Publish Date - Apr 17 , 2025 | 04:32 AM
వక్ఫ్ చట్ట సవరణకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో జరిగిన అల్లర్ల వెనుక కేంద్ర హోమంత్రియే ఉన్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. అల్లరి మూకలు బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ లోకి ప్రవేశించేందుకు బీఎస్‌ఎఫ్ అనుమతిచ్చిందని చెప్పారు.
కోల్‌కతా, ఏప్రిల్ 16: వక్ఫ్ చట్ట సవరణకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో జరిగిన అల్లర్ల వెనుక కుట్ర ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీని వెనుక ఉన్నారని ఆరోపించారు. అందువల్లే సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్) బంగ్లాదేశ్ నుంచి అల్లరి మూకలు పశ్చిమ బెంగాల్‌లో చొరబడేందుకు అనుమతించిందన్నారు. ముస్లిం మత పెద్దలతో కోల్‌కతాలో బుధవారం నిర్వహించిన ఒక సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో తమ పార్టీ ముందుంటుందని స్పష్టం చేశారు. శాంతియుతంగా నిరసనలు తెలపాలని కోరారు. హోంమంత్రి అమిత్ షా తమకు వ్యతిరేకంగా అన్ని కేంద్ర ఏజెన్సీలను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ ఆయన్ను అదుపు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...