Share News

Monalisa Director: మోనాలిసా డైరెక్టర్‌పై కేసు.. అత్యాచారం, ఆపై అసభ్య వీడియోలతో వేధింపులు

ABN , Publish Date - Mar 31 , 2025 | 01:54 PM

మహా కుంభమేళా వేడుకల్లో కనిపించి ఆ తర్వాత దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది మోనాలిసా. ఆమెను హీరోయిన్‌గా పరిచయం చేస్తానంటూ ప్రకటించి వార్తల్లో నిలిచాడు దర్శకుడు సనోజ్ మిశ్రా. తాజాగా మరోసారి ఈ డైరెక్టర్ పేరు వార్తల్లోకి ఎక్కింది. అది కూడా అత్యాచారం కేసులో. ఆ వివరాలు..

Monalisa Director: మోనాలిసా డైరెక్టర్‌పై కేసు.. అత్యాచారం, ఆపై అసభ్య వీడియోలతో వేధింపులు
Monalisa Director Sanoj Mishra

దర్శకుడు సనోజ్ మిశ్ర గుర్తున్నాడా.. అతను ఎవరు అనుకుంటున్నారా.. మహా కుంభమేళా సెన్సేషన్ మోనాలిసా గుర్తుందిగా.. తనకు సినిమా అవకాశం ఇచ్చిన డైరెక్టరే ఈ సనోజ్ మిశ్ర. కొన్ని రోజుల క్రిం వరకు మోనాలిసా వల్ల వార్తల్లో నిలిస్తే.. తాజాగా మరోసారి అతడి పేరు మార్మోగిపోతుంది. కారణం.. అతడిపై అత్యాచారం కేసు నమోదు కావడమే. ఢిల్లీ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అసలేం జరిగింది అంటే..


దర్శకుడు సనోజ్ మిశ్రను ఢిల్లీ పోలీసులు నేడు(సోమవారం) అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటాను, హీరోయిన్‌గా అవకాశం కల్పిస్తానని నమ్మబలికి ఓ యువతిపై పలు మార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు సనోజ్ మిశ్ర. మాట వినకపోతే.. వారి అసభ్య వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. డైరెక్టర్‌ను అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు.. ఝాన్సీ ప్రాంతంలో నివాసం ఉండేది. 2020లో ఆమెకు డైరెక్టర్ మిశ్రతో పరిచయం ఏర్పడింది. అది కూడా టెక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా. పరిచయం కాస్త స్నేహంగా మారడంతో ఇద్దరి మధ్య మాటలు మొదలయ్యాయి. ఈ క్రమంలో 2021, జూన్ 17న మిశ్ర బాధితురాలికి కాల్ చేశాడు. తాను ఝాన్సీ రైల్వే స్టేషన్‌లో ఉన్నానని.. తనను కలవాల్సిందిగా కోరాడు. బాధితురాలు రానని చెప్పడంతో.. చనిపోతానంటూ మిశ్ర ఆమెను బెదిరించాడు.


అతడి బెదిరింపులకు భయపడిన బాధితురాలు తర్వాత రోజు అనగా జూన్ 18, 2021 నాడు మిశ్రాని కలిసింది. తర్వాత ఇద్దరు ఓ రిసార్ట్‌కు వెళ్లార. అక్కడ మిశ్రా బాధితురాలికి మత్తుమందు ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాక ఆ దరిద్రాన్ని వీడియోలు తీసి.. ఆమెని బెదిరించి.. అనేక మార్లు కోరిక తీర్చుకున్నాడు. అంతేకాక బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని, తన సినిమాల్లో ఆమెకు అవకాశాలు ఇస్తానని నమ్మబలికాడని చెప్పుకొచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

మిశ్రా విషయానికి వస్తే.. ఆయన గాంధీగిరి, రామ్ కి జన్మభూమి, లఫంగే నవాబ్, కాశీ టూ కశ్మీర్ వంటి సినిమాలను తెరకెక్కించాడు. మోనాలిసాకు హీరోయిన్ అవకాశం ఇస్తానని ప్రామిస్ చేసిన మిశ్ర.. ప్రస్తుతం ఆమెని యాక్టింగ్ కోర్స్‌లో జాయిన్ చేశాడని సమాచారం.

ఇవి కూడా చదవండి:

ప్రత్యేక విమానంలో ముంబైకి కొడాలి నాని.. కారణమిదే

ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది

Updated Date - Mar 31 , 2025 | 02:04 PM