Share News

Terror Attack: తలపై గురిపెట్టి, కలిమా చదవమన్నారు

ABN , Publish Date - Apr 24 , 2025 | 06:02 AM

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి సమయంలో, అసోం యూనివర్సిటీలో బెంగాలీ బోధించే ప్రొఫెసర్‌ దేబాశీష్‌ భట్టాచార్య కుటుంబంతో పాటు అక్కడ ఉన్నారు. ముష్కరుడు కలిమా చదవమని అడిగినప్పుడు, ఆయన వదిలిపెట్టారు.

Terror Attack: తలపై గురిపెట్టి, కలిమా చదవమన్నారు

పక్కనున్న వాళ్లతో పదం కలిపి బతికిపోయాను

అసోం వర్సిటీ ప్రొఫెసర్‌ దెబాశీష్‌ భట్టాచార్య

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన సమయంలో.. అసోం యూనివర్సిటీలో బెంగాలీ బోధించే ప్రొఫెసర్‌ దేబాశీష్‌ భట్టాచార్య కూడా తన కుటుంబ సభ్యులతో అక్కడే ఉన్నారు. ఆయన ఎన్‌డీటీవీతో మాట్లాడుతూ మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఘటన వివరాలను వెల్లడించారు. ‘‘బైసరన్‌ అందాలను వీక్షిస్తున్నాం. పర్యాటకులు గుంపులుగుంపులుగా ఉన్నారు. తొలుత తుపాకీ పేలిన శబ్దాలు వస్తే.. అటవీశాఖ అధికారుల చర్య అనుకున్నాం. కాసేపటికి ఓ సాయుధుడు ముసుగు ధరించి మాకు కొంత దూరంలో ఉన్న జంటతో మాట్లాడాడు. అప్పటికీ.. అతణ్ని అటవీశాఖ అధికారిగానే భావించాం. కానీ, అతను హఠాత్తుగా అక్కడున్న యువకుడిని కాల్చి చంపాడు. దాంతో.. మేము ఉన్న చోట గుంపు అంతా ఓ చెట్టు వద్ద నేలపై పడుకున్నాం. దుండగుడు మా వద్దకు వచ్చాడు. కలిమా(ఇస్లామిక్‌ వాక్యం) చదవమన్నాడు. నా చుట్టూ ఉన్నవారు కలిమా చదివారు. నేను కూడా వారితో పదం కలిపాను. నా వద్దకు వచ్చి తలకు తుపాకీ గురిపెట్టాడు. అప్పటికే కలిమాను వినడం వల్ల.. ‘లా ఇలాహ..’ అంటూ ఉచ్ఛరించాను. అంతే.. ముష్కరుడు నన్ను వదిలి వెళ్లిపోయాడు’’ అని భట్టాచార్య వివరించారు.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 24 , 2025 | 06:02 AM