Panel Criticizes Fund Halt: తమిళనాడుకు నిధుల నిలుపుదల సరికాదు
ABN , Publish Date - Mar 27 , 2025 | 04:18 AM
పీఎం శ్రీ స్కూల్ పథకం అమలు చేయడానికి నిరాకరించిన రాష్ట్రాలకు నిధులను కేంద్రం నిలిపివేయడం సరికాదని పార్లమెంటరీ స్థాయీ సంఘం అభిప్రాయపడింది

న్యూఢిల్లీ, మార్చి 26 : పీఎం శ్రీ స్కూల్ పథకం అమలు చేయడానికి నిరాకరించిన రాష్ట్రాలకు నిధులను కేంద్రం నిలిపివేయడం సరికాదని పార్లమెంటరీ స్థాయీ సంఘం అభిప్రాయపడింది. జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడానికి నిరాకరించిన తమిళనాడుకు రూ. 2,100 కోట్ల నిధులను కేంద్రం ఆపివేయడంపై ప్రస్తుతం వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే విద్య, మహిళలు, యువత, క్రీడల వ్యవహారాల స్థాయీ సంఘం పై అభిప్రాయం వ్యక్తం చేసింది. తన సిఫారసులను అది బుధవారం రాజ్యసభకు సమర్పించింది. ఈ సంఘానికి కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ నాయకత్వం వహిస్తున్నారు. తమిళనాడుతోపాటు పశ్చిమబెంగాల్‌కు రూ.వెయ్యి కోట్లు, కేరళకు రూ. 859.63 కోట్లు ఆపివేశారని స్థాయీ సంఘం తెలిపింది. ఈ మూడు రాష్ట్రాలు తప్పిస్తే మిగతా అన్ని రాష్ట్రల్లో ఈ పథకం అమలవుతోందని పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
Yogi Adityanath: యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
కొబ్బరి నీళ్ల కంటే.. మంచి నీళ్లు మేలు.. డాక్టరేంటి ఇలా అన్నాడు..